NTR - ALLU: తరతరాల బంధం...

ABN , Publish Date - May 14 , 2025 | 06:50 PM

నందమూరి ఫ్యామిలీకి, అల్లువారి కుటుంబానికి మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. నటరత్న యన్టీఆర్ కు ఆ రోజుల్లో మదరాసులో అన్ని చిత్రసీమల్లోని వారితోనూ అనుబంధం ఉండేది. అలాగే తెలుగు చిత్రసీమలో తనకంటూ కొంతమంది నటీనటులను తన సొంతమనుషులుగా చూసుకొనేవారు రామారావు. అలాంటి వారిలో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య ముందుండేవారు.

నందమూరి ఫ్యామిలీకి, అల్లువారి కుటుంబానికి మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. నటరత్న యన్టీఆర్ (NTR) కు ఆ రోజుల్లో మదరాసులో అన్ని చిత్రసీమల్లోని వారితోనూ అనుబంధం ఉండేది. అలాగే తెలుగు చిత్రసీమలో తనకంటూ కొంతమంది నటీనటులను తన సొంతమనుషులుగా చూసుకొనేవారు రామారావు. అలాంటి వారిలో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) ముందుండేవారు. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలలో వీరిద్దరూ తప్పనిసరిగా ఉండేవారు. అలాగే యన్టీఆర్ సొంత చిత్రాలలోనూ వీరిద్దరికీ తగిన పాత్రలు ఉండేవి. వీరిద్దరే కాదు ఎంతోమంది పేరున్న నటీనటులు యన్టీఆర్ ఫ్యామిలీలాగా ఉండేవారు. అందువల్ల యన్టీఆర్ కోటరీలో ఉండటానికి పలువురు నటీనటులు ఇష్టపడేవారు. ఇతర హీరోల చిత్రాల్లోనూ తన సన్నిహితులకు మంచి పాత్రలు లభిస్తే యన్టీఆర్ అభినందిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో యన్టీఆర్ ఫ్యామిలీలాగా ఉన్న వారిలో అల్లు రామలింగయ్య స్థానం ప్రత్యేకమైనది. యన్టీఆర్ సొంత చిత్రాలలో అల్లు రామలింగయ్య నటిస్తే వెంటనే పారితోషికం పుచ్చుకొనేవారు కారు. 'మీ దగ్గర ఎక్కడికి పోతాయ్... ఉంచండి... నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా..." అంటూ ఉండేవారు అల్లు రామలింగయ్య. అలాగే ఆయనకు అవసరమైనప్పుడు యన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు రామలింగయ్యకు డబ్బు సర్దేవారు. యన్టీఆర్ తో అల్లు రామలింగయ్య దాదాపు వంద చిత్రాలలో నటించి ఉంటారు.


యన్టీఆర్, అల్లు రామలింగయ్య కలసి అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యన్టీఆర్ అన్నిటా హీరోగా నటిస్తే, అల్లు పాత్రల్లోనే మార్పు ఉండేది. కొన్నిసార్లు కమెడియన్ గా అలరిస్తే, మరికొన్ని సార్లు కామెడీ విలన్ గానూ ఆకట్టుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ అనుబంధం కడదాకా సాగింది. యన్టీఆర్ డైరెక్షన్ లోనూ రామలింగయ్య పలు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. యన్టీఆర్ చిత్రసీమలో పెద్దాయనగా సాగారు. వయసులో రామారావు కంటే రామలింగయ్య కాస్త పెద్దవారు. అందువల్ల ఇద్దరూ ఎంతో గౌరవం ఇచ్చిపుచ్చుకొనేవారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో యన్టీఆర్, అల్లు రామలింగయ్య భుజంపై ఆప్యాయంగా చెయ్యేసి ముచ్చటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో యన్టీఆర్, అల్లు రామలింగయ్య ఇలా ముచ్చటించుకుంటున్నారు.

మరోవైపు యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ భుజంపై అల్లు రామలింగయ్య వాత్సల్యంతో చెయ్యేసి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ (Balakrishna) తోనూ అల్లు రామలింగయ్య అనేక చిత్రాలలో కలసి నటించారు. ఈ రెండు ఫోటోలను చూస్తేనే నందమూరి కుటుంబానికి, అల్లువారికి ఎంత అనుబంధం ఉందో ఇట్టే తెలిసిపోతోంది.

Also Read: Tom Cruise: మే 17న మిషన్ ఇంపాజిబుల్ చివరి భాగం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 14 , 2025 | 06:50 PM