సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Young And Dynamic: రౌడీ మంచివాడిగా మారితే.. 

ABN, Publish Date - Sep 19 , 2025 | 06:10 PM

శ్రీరామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ ‘యంగ్‌ అండ్‌ డైనమిక్‌’. మిథున ప్రియ కథానాయిక. కిశోర్‌ శ్రీకృష్ణ దర్శకుడు.

శ్రీరామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ ‘యంగ్‌ అండ్‌ డైనమిక్‌’. మిథున ప్రియ కథానాయిక. కిశోర్‌ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ ను విడుదల చేశారు. 

దర్శకులు వీరశంకర్‌, వీఎన్‌ ఆదిత్య, సముద్ర అతిథులుగా విచ్చేసి ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిదని, ఒక రౌడీ మంచివాడిగా మారి ఊరిని ఎలా ఉద్ధరించాడనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు కిశోర్‌ శ్రీకృష్ణ తెలిపారు.  

Updated Date - Sep 19 , 2025 | 06:10 PM