Tollywood: నాచారంలో మరో మల్టీప్లెక్స్
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:09 PM
నాచారంలోని యూకే సినీ ప్లెక్స్ థియేటర్లను దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ప్రారంభించారు.
ఇవాళ సింగిల్ థియేటర్స్ చాలా వరకూ మూతపడుతున్నాయి. అదే సమయంలో ఫిల్మ్ ఎగ్జిబిషన్స్ ను వదులుకోవడం ఇష్టంలేని వారు అదే చోట మల్టిప్లెక్స్ థియేటర్స్ నిర్మాణం జరుపుతున్నారు. అలానే కాకుండా మరికొందరు పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నవారితో కలిసి మల్టీప్లెక్స్ లను నిర్మిస్తున్నారు. తాజాగా అలా హైదరాబాద్ శివార్లలోని నాచారంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'యూకే సినీ ప్లెక్స్' (UK Cineplex) నిర్మితమైంది. బుధవారం ఈ థియేటర్ల సముదాయాన్ని 'దిల్' రాజు (Dil Raju), సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శాసన సభ్యులు లక్ష్మారెడ్డి తదితరులు ప్రారంభించారు. ఉప్పల్, హబ్సిగూడ, నాచారంలోని వారికి ఈ థియేటర్లు అందుబాటులో ఉంటాయి.
యూకే సినీ ప్లెక్స్ ప్రారంభోత్సవం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ, 'ఈ మల్టిప్లెక్స్ థియేటర్స్ నిర్మాణం ఎంతో ఉన్నతంగా ఉందని, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, సీట్స్ ఎంతో బాగున్నాయ'ని అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పృతికా ఉదయ్, రుషిల్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యు. కె. సినీప్లెక్స్ లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. సినీ ప్రేమికులు ఎంజాయ్ చేసే విధంగా ఈ థియేటర్లు ఉండబోతున్నాయి. మృదువైన సీటింగ్, ప్రీమియం రిక్లైనర్స్, సౌకర్యవంతమైన సోఫాలు, అట్మో సౌండ్, లేజర్ ప్రొడక్షన్, సిల్వర్ స్క్రీన్లు ప్రేక్షకులకు సినిమా టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయని, అలానే లైవ్ కౌంటర్లు, పిజ్జాలు, శాండ్విచ్ లు, డెజర్ట్ లు వంటి రుచికరమైన ఫుడ్ అండ్ బివరేజెస్ కూడా ఒకే గదిలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Also Read: Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ
Also Read: OG: ఓజీ.. ఉస్తాద్ క్రేజీ అప్‌డేట్ వైరల్..