Samantha Marriage: సమంత పెళ్లి.. జీరోలైన తెలుగు హీరోలు! మౌనానికి.. కారణం?
ABN, Publish Date - Dec 02 , 2025 | 01:17 PM
సమంత సెకండ్ మ్యారేజ్ పై తెలుగు, తమిళ స్టార్ హీరోలు మౌనంగా ఉండటాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కొందరు మాత్రమే సమంతకు శుభాకాంక్షులు తెలిపిన వారిలో ఉన్నారు.
సమంత (Samantha) ఇవాళ తెలుగులో పెద్దగా సినిమాలు చేస్తుండకపోవచ్చు. కానీ నిన్నటి వరకూ ఓ స్టార్ హీరోయిన్. అగ్ర కథానాయకులు అందరితోనూ సినిమాలు చేసిన నాయిక. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత నాగచైతన్య (Nagachaitanya), సమంత విడిపోయి విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య గత యేడాది డిసెంబర్ 4న నటి శోభిత ధూళిపాల (Sobhitha Dhulipaala) ను పెళ్ళి చేసుకున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ జంట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోబోతోంది. అంటే చైతు పెళ్ళి అయ్యి యేడాది తిరగకుండానే సమంత సైతం పెళ్ళి పీటలు ఎక్కేసింది. డిసెంబర్ 1న ఆమె వివాహం దర్శకుడు, నిర్మాత, చిత్తూరి వాసి అయిన రాజ్ నిడిమోరుతో అయ్యింది.
ఆ రకంగా ఇటు నాగచైతన్య, అటు సమంత పర్సనల్ లైఫ్ కు శుభం కార్డు పడినట్టే. ఇది అందరూ అభినందించాల్సిన సమయం. అయితే చిత్రంగా సమంతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె శుభమా అని పెళ్ళి చేసుకుంటే... ఆమె చర్యల కారణంగానే నాగచైతన్య విడాకులు ఇవ్వాల్సి వచ్చిందన్నట్టుగా పోస్టులు ఎక్కువ మంది పెడుతున్నారు. సమంతతో గతంలో సన్నిహితంగా ఉన్న కొందరు సైతం ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. వీటన్నింటినీ సమంత మనసులోకి తీసుకోకపోవచ్చు. అయితే... టాలీవుడ్ హీరోల ప్రవర్తన ఖచ్చితంగా సమంత మనసును ఏదో ఒక స్థాయిలో గాయపర్చే ఆస్కారం లేకపోలేదు.
సమంత, రాజ్ నిడిమోరు వివాహ వార్త అధికారికంగా బయటకు వచ్చీ రాగానే ఉపాసన (Upasana), హీరోయిన్లు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Peeth Singh), కీర్తి సురేశ్ (Keethi Suresh), రుహాని శర్మ (Ruhani Sharma), అలేఖ్య హారిక, దర్శకురాలు నందినీరెడ్డి (Nandini Reddy), నీరజ కోన (Neeraja Kona) వంటి వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ (Ram Charan) సరసన సమంత 'రంగస్థలం'లో నాయిగా నటించింది. ఆ సమయంలో ఉపాసనకు సమంతకు మధ్య స్నేహం ఏర్పడి ఉండొచ్చు. ఇక కాజల్ అగర్వాల్ తో కలిసి కెరీర్ ప్రారంభంలో 'బృందావనం' మూవీలో చేసింది. కీర్తి సురేశ్ నటించిన 'మహానటి'లో సమంత కీలక పాత్రను పోషించింది. దర్శకులు నందినీ రెడ్డి సమంతతో రెండు సినిమాలు చేసింది. గతంలో నీరజ కోన సమంతకు స్టైలిస్ట్ గా వ్యవహరించింది. వీరందరికీ ఆమెతో పర్సనల్ గా అనుబంధం ఉంది. సో... వాళ్ళు అభినందించారు.
సమంత సరసన నటించిన తెలుగు స్టార్ హీరోలు ఆమెను వివాహం సందర్భంగా అభినందించలేదన్నది వాస్తవం. కేవలం ఆమె సరసన 'అ ఆ'లో నటించిన నితిన్, సమంతకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రమే సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. సమంత విడాకులకు ఇచ్చింది అక్కినేని నాగార్జున కొడుకు, హీరో నాగచైతన్యకు కాబట్టి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపితే అక్కినేని కుటుంబం కినుక వహిస్తుందని వీరంతా మౌనంగా ఉండి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. మొన్నటి వరకూ తమతో నటించిన హీరోయిన్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తే వీరు మౌనవ్రతం చేపట్టడం ఏమిటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, రామ్ చరణ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పవన్ కళ్యాణ్, శర్వానంద్, విజయ్ దేవరకొండ వీరందరి తీరు పట్ల ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. హీరోలతో పాటు దర్శకులూ పెదవి విప్పకపోవడం గురించి చిత్రంగా మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగు వారు మాత్రమే కాదు తమిళ హీరోలు సైతం సమంత రెండో పెళ్ళిపై స్పందించలేదు. నిన్న మొన్నటి వరకూ సమంత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా... ఈ రెండో పెళ్ళి పట్ల వీరంతా మౌనం వహించడానికి ఎవరికి వారికి ఏదో కారణం ఉండే ఉంటుందని భావించాలి.
Also Read: Thamma - Ott: 'థామా' ఓటీటీ స్ట్రీమింగ్.. అయితే చిన్న కండీషన్..
Also Read: Akhanda -2: గీతామాధురీ యాక్ట్ చేసిందిరోయ్...