Tollywood: ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ మధ్యే వార్
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:12 PM
డిసెంబర్ 28న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీనిలో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు డిసెంబర్ 28న హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కార్యాలయంలో జరుగబోతున్నాయి. ఛాంబర్ లోని స్టూడియో, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ నాలుగు సెక్టార్ల కౌన్సిల్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. అయితే ఈసారి పోటీ ప్రధానంగా అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానల్ కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు మధ్యనే ప్రధానమైన పోటీ ఉండబోతోంది.
ఇందులో ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి భరత్ చౌదరి, చిరంజీవి (చెర్రీ), కృష్ణ ప్రసాద్ శివలెంక, లీలా దామోదర ప్రసాద్ (దాము), రాజేశ్ దండు, రామకృష్ణ గారగపర్తి (రాంకీ), రామకృష్ణ కసుల, రామకృష్ణ వి (ఆర్.కె.), రమేశ్ మన్యం, స్రవంతి రవికిశోర్, సాంబ శివరావు జె, సతీశ్ కుమార్ వర్మ వేగేశ్న, మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు డి., సుబ్బారావు జంజనం, వివేక్ కూచిభొట్ల, సుదర్శన్ రెడ్డి ఆర్., సుధాకర్ బాబు సిహెచ్., వెంకటేశ్ మంచి, వేణుగోపాల్ బెక్కెం బరిలో ఉన్నారు. దీనికే మన ప్యానెల్ నుండి అమ్మిరాజు, బాబ్జీ, వైవియస్ చౌదరి, గురురాజ్, సి. కళ్యాణ్, పల్లి కేశవరావు, కోటి బాబు, పి.ఎల్.కె. రెడ్డి, లక్ష్మీ కరణ నట్టి, మోహన్ వడ్లపట్ల, పద్మిని ఎన్, ప్రసన్న కుమార్ తుమ్మల, రామకృష్ణ గౌడ్, రామసత్యనారాయణ, రామేశ్ బాబు వల్లూరిపల్లి, రవిచంద్ యలమంచి, చదలవాడ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, సురేందర్ రెడ్డి, ఎం.వి. కిశోర్ పూసల పోటీ చేస్తున్నారు.
అలానే ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రోగ్రెసివ్ ప్యానెల్ అభిషేక్ అగర్వాల్, అశోక్ కుమార్, బాపినీడు, కృష్ణప్రసాద్ శివలెంక, లీలా దామోదర ప్రసాద్, నాగవంశీ సూర్యదేవర, కె.ఎస్. రామారావు, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, సాంబశివరావు ఐ, చలసాని ప్రియాంక దత్, దిల్ రాజు బరిలో ఉన్నారు. ఇక మన ప్యానర్ లో నుండి ఈ కేటగిరికి అమ్మిరాజు, వైవియస్ చౌదరి, సి. కళ్యాణ్, పల్లి కేశవరావు, నట్టి లక్ష్మీ కరుణ, వడ్లపట్ల మోహన్, ఎన్. పద్మిని, ప్రసన్న కుమార్ తుమ్మల, ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, సాయి వెంకట్ పోటీ చేస్తున్నారు.
Also Read: Mission Santa: 'మహావతార్ నరసింహ' బాటలో 'మిషన్ సాంటా'
Also Read: Roshan: ఆ ఛాన్స్ ఇవ్వను.. వంద శాతం హిట్ పక్కా..