Roshan: ఆ ఛాన్స్‌ ఇవ్వను.. వంద శాతం హిట్‌ పక్కా..

ABN , Publish Date - Dec 22 , 2025 | 02:08 PM

‘అమ్మ నాన్న కష్టాన్ని నమ్ముకోమని, దేని మీద కష్టపడతామో అది చాలా ఇంపార్టెంట్‌ అని చెప్పారు.  మూడేళ్లు ఒక ప్రాజెక్ట్‌ కోసం ఆగాను అంటే అది కేవలం ఛాంపియన్‌ కోసమే.


‘అమ్మ నాన్న కష్టాన్ని నమ్ముకోమని, దేని మీద కష్టపడతామో అది చాలా ఇంపార్టెంట్‌ అని చెప్పారు.  మూడేళ్లు ఒక ప్రాజెక్ట్‌ కోసం ఆగాను అంటే అది కేవలం ఛాంపియన్‌ కోసమే. దాని ప్రతిఫలం ఏంటో తెరపైన చూస్తారు. భవిష్యత్తులో ఏదైనా తప్పు చేేస్త మీరందరూ నన్ను తిట్టుకోవచ్చు కానీ డిసెంబర్‌ 25న మీకు ఆ అవకాశం ఇవ్వను. అందరూ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు’ అని రోషన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఛాంపియన్‌’. అనస్వర రాజన్‌ కథానాయిక. ప్రదీప్‌ అద్వైతం దర్శకుడు.  జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో గ్రాండ్‌ గా ఛాంపియన్‌ నైట్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

రోషన్‌ మాట్లాడుతూ ‘కొంతగ్యాప్‌ తర్వాత చేసిన సినిమా ఇది. ప్రదీప్‌గారు కథ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయనని డిసైడ్‌ అయిపోయాను. నాలుగు రోజుల్లో రిలీజ్‌ కాబోతోంది. ప్రదీప్‌ గారి విజన్‌ని స్వప్న గారు నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకువెళ్లారు. పీటర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లో నాకు కొన్ని గాయాలయ్యాయి. ఆయనతో మళ్లీమళ్లీ యాక్షన్‌ సీన్లు చేయాలని కోరుకుంటున్నాను. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ ప్రతి సినిమా వంద శాతం కష్టపడతానని ప్రేక్షకులతో, మేకర్స్‌తోనూ అనిపించుకుంటా. మీ నమ్మకమే నా రియల్‌ సక్సెస్‌. మొన్నటి వరకు టెన్షన్‌ ఉండేది. ట్రెలర్‌ వచ్చిన తర్వాత హిట్‌ కొడతామని నమ్మకం వచ్చేసింది. వైజయంతిలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంస్థ పరిచయం చేసిన హీరోలంతా టాప్‌ రేంజ్‌లో ఉన్నారు. నన్ను కూడా ఛాంపియన్‌ ద్వారా తీసుకురావడం ఆనందంగా ఉంది’ అన్నారు.

హీరోయిన్‌ అనస్వర మాట్లాడుతూ  తెలుగులో వస్తున్న నా మొదటి సినిమా ఇది. దర్శకనిర్మాతలకు థ్యాంక్యూ. గిరిగిర’ గుర్తుండిపోతుంది. రోషన్‌ ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. డిసెంబర్‌ 25య రోహన్‌ని అందరూ ప్రేమిస్తారు’ అని అన్నారు.
ఊహ మాట్లాడుతూ రోషన్‌ మూడేళ్లు ఎదురు చూశాడు. దానికి ప్రతిఫలం ఈ సినిమా ఇస్తుంది. మైఖేల్‌గా  తనకి అవకాశం ఇచ్చిన ప్రదీప్‌ గారికి థాంక్యూ. దత్‌ గారు కిరణ్‌ గారు అందరూ రోషన్‌ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ సంస్థలో రోషన్‌ రీలాంచ్‌ అవడం ఆనందంగా వుంది’ అని అన్నారు.

 

Updated Date - Dec 22 , 2025 | 02:18 PM