Homebound Oscars: ఆస్కార్ చేరువలో.. భారత సినిమా ‘హోమ్‌బౌండ్’! షార్ట్ లిస్టులో చోటు
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:45 AM
ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. ‘హోంబౌండ్’ ప్రతిష్టాత్మక ఆస్కార్ షార్ట్‌లిస్టులో చోటు దక్కించుకుంది.
ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter), విశాల్ జెత్వా (Vishal Jethwa), జాన్వీకపూర్ (Janhvi Kapoor) లీడ్ రోల్స్‌లో రూపొందిన హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్’ (home bound). నీరజ్ గెవాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ మే 21న ప్రేక్షకుల ముందకొచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆస్కార్ (Oscars.) అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా సెలక్ట్ అయి చరిత్ర సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది.
అయితే.. మరో మూడు నెలల్లో అస్కార్ అవార్డుల ప్రధానం ఉన్న నేథ్యంలో తాజాగా అకాడమీ వివిధ దేశాల నుంచి వచ్చిన వందలాది సినిమాలను ఫిట్లర్ చేసి 15 సినిమాలను షార్ట్ లిస్ట్‌లో చేర్చింది. అందులో మన దేశం నుంచి అధికారికంగా పంపిన ‘హోమ్‌బౌండ్’ కూడా ఉండడం విశేషం.
మానవ భావోద్వేగాలు, కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జ్యూరీని ఆకట్టుకుంది. అంతేగాక ఆస్కార్ షార్ట్‌లిస్టులోకి రావడం ద్వారా చిత్రబృందానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించనుండడంతో పాటు ఇకపై భారతీయ చిత్రాలపై ప్రపంచ దృష్టి మరింత పెరుగుతుందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.