సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Film Awards: జాతీయ సినిమా అవార్డుల ప్రదానం

ABN, Publish Date - Sep 23 , 2025 | 11:28 AM

ఈసారి తెలుగు సినిమాలకు ఏడు కేటగిరిల్లో జాతీయ అవార్డులు దక్కాయి. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని విజేతలు అందుకోబోతున్నారు. మోహన్ లాల్ కూ ఇదే వేదికపై దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందిస్తారు.

National Film Awards

న్యూఢిల్లీలో 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సం మంగళవారం జరుగబోతోంది. విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా వీటిని స్వీకరించబోతున్నారు. 2023 జాతీయ అవార్డులు తెలుగు సినిమాలకు వివిధ కేటగిరిల్లో ఏడు అవార్డులు రావడం విశేషం.

ఈ యేడాది నందమూరి బాలకృష్ణ (Balakrishna) పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. విశేషం ఏమంటే... ఆయన కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) మూవీ కూడా ఈ యేడాది ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమాకు జాతీయ అవార్డుకు ఎంపికైంది. అనిల్ రావిపూడి (Anil Raavipudi) దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో కాజల్ (Kajal) హీరోయిన్ గా నటించగా, శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రను పోషించింది. ఉమెన్ ఎంపొవర్ మెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సముచిత గౌరవం దక్కిందని తెలుగు రంగానికి చెందిన వారంతా అనుకున్నారు. సాయి రాజేశ్‌ (Sai Rajesh) దర్శకత్వంలో మారుతీ, ఎస్.కె.ఎన్. నిర్మించిన 'బేబీ' (Baby) సినిమా సైతం రెండు జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీప్లే రైటర్ గా ఆ సినిమా దర్శకుడు సాయిరాజేశ్‌ ఎంపిక కాగా, అదే చిత్రంలో 'ప్రేమిస్తున్నా...' పాట పాడిన పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (Rohith) ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును అందుకోబోతున్నాడు.


యువ కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) నటించిన పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' (Hanu-man) కు సైతం రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. అందులో యాక్షన్ సీక్వెన్స్ ను కొరియోగ్రఫీ చేసిన నందు, పృథ్వీ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా ఎంపికయ్యారు. అలానే ఈ సినిమాకు ఎ.వి.జి.సి. విభాగంలోనూ నేషనల్ అవార్డ్ వచ్చింది. విశేషం ఏమంటే... 'హను-మాన్' తర్వాత వచ్చిన తేజ సజ్జా తాజా చిత్రం 'మిరాయ్' (Mirai) సైతం చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. 'జబర్దస్త్' ఫేమ్ వేణు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన 'బలగం' (Balagam) సినిమాకు సైతం ఒక అవార్డ్ వచ్చింది. ఆ సినిమాలోని 'ఊరు పల్లెటూరు' పాటను రాసిన కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) ఉత్తమ గీత రచయితగా తొలిసారి జాతీయ అవార్డును అందుకోబోతున్నాడు. అలానే 'గాంధీతాత చెట్టు' (Gandhi Tata Chettu) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి సైతం ఉత్తమ బాలనటిగా ఈ రోజు జాతీయ అవార్డు అందుకోబోతోంది.

2023కి గానూ షారుఖ్‌ ఖాన్, విక్రాంత్ మాస్సే కలిసి ఉత్తమ నటుడు అవార్డును అందుకోబోతున్నారు. రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డును స్వీకరించబోతోంది. అలానే వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు జాతీయ అవార్డులను అందుకోబోతున్నారు. విశేషం ఏమంటే... ఇదే వేదికపై ప్రముఖ నటుడు మోహన్ లాల్ సైతం దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించబోతున్నారు. సినిమా రంగానికి చేసి సేవకు గానూ మోహన్ లాల్ కు ఈ అత్యుత్తమ పురస్కారం దక్కుతోంది.

Also Read: Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...

Also Read: Chiru - Pawan: అన్నదమ్ముల సంభాషణ.. ఆర్‌జీవీ కామెంట్‌..

Updated Date - Sep 23 , 2025 | 11:29 AM