సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

CM Revanth Reddy: ఎఫ్.ఎన్.సి.సి.లో రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Sep 20 , 2025 | 12:57 PM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు ఎఫ్.ఎన్.సి.సి.కి వచ్చారు.

CM Revanth Reddy

సీ.ఎం. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ప్రజల మనిషిగా పేరుంది. ఎవరు ఎప్పుడైనా ఆయన్ని కలుసుకునే ఆస్కారం ఉంటుంది. సెక్రటేరియట్ లోనే కాకుండా అవసరం అయితే ఆయన ఇంటికి సైతం ఎవరైనా వెళ్ళి కలిసే సౌలభ్యం ఉంది. ఇటీవల తెలుగు సినిమా (Telugu Cinema) రంగంలోని కార్మికులు సమ్మెకు దిగినప్పుడు రేవంత్ రెడ్డి చొరవ చూపి, దానిని ఆపించే ప్రయత్నం చేసి, సఫలమయ్యారు. సమ్మె జరుగుతుండగానూ, సమ్మె ముగిసిన తర్వాత కూడా సీనియర్ నిర్మాతలు, దర్శకులతో ఆయన చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిందిగా కోరారు. అలానే ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ కార్మిక నాయకులను తన ఇంటికి పిలిపించుకుని రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, దానికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను వరల్డ్ ఫిల్మ్ హబ్ గా చేయాలనే తన సంకల్పాన్ని వారికి తెలియచేసి, అందుకోసం వారు సైతం కృషి చేయాలని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో విజేతలైన తెలుగు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను తన ఇంటికి ఆహ్వానించి, వారిని సత్కరించారు. ఇలా తెలుగు సినిమా రంగంలో రేవంత్ రెడ్డి నిత్యం టచ్ లోనే ఉంటూ ముందుకు సాగుతున్నారు.


ఇదిలా ఉంటే... శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్‌ సెంటర్ (FNCC)లో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కె. ఎస్. రామారావు (K.S. Ramarao), సెక్రటరీ తుమ్మల రంగారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. ఎన్. రెడ్డి, ట్రెజరర్ శైలజ, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భవాని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు.

Also Read: Deepika Padukone: ఏం నేర్చుకున్నాం.. ఎవరితో చేస్తున్నామనే విషయాలే ప్రధానం...

Also Read: Krish 4: హృతిక్‌తో నేషనల్‌ క్రష్‌..

Updated Date - Sep 20 , 2025 | 12:57 PM