Tollywood: అంగరంగ వైభవంగా సావిత్రి మహోత్సవ్
ABN, Publish Date - Nov 28 , 2025 | 04:34 PM
డిసెంబర్ 1 నుండి 6 వరకూ హైదరాబాద్ లో సావిత్రి మహోత్సవ్ జరుగబోతోంది. సావిత్రి చిత్రాల ప్రదర్శనతో పాటు పాటల పోటీని నిర్వహించబోతున్నారు.
మహానటి సావిత్రి (Savitri) 90వ జయంతి ఉత్సవాలను ప్రముఖ కళా సంస్థ సంగమం (Sangamam) తో కలిసి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి (Vijaya Chamundeswari) నిర్వహించ బోతున్నారు. డిసెంబర్ 1 నుండి 6 వరకూ 'సావిత్రి మహోత్సవ్' పేరుతో హైదరాబాద్ రవీంద్రభారతి లో నిర్వహించబోతున్నట్టు ఆమె తెలిపారు. ఈ ఆరు రోజులు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయని చెప్పారు. డిసెంబర్ 6వ తేదీ జరిగే ముగింపు ఉత్సవంలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ అశ్విన్, ప్రియాంకా దత్, స్వప్నా దల్ లను, సావిత్రి క్లాసిక్స్ పుస్తక రచయిత సంజయ్ కిశోర్ ను, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ప్రత్యేకంగా సత్కరించనున్నారు.
ఈ కార్యక్రమం మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరుగుతుందని దీనికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారని విజయ చాముండేశ్వరి తెలిపారు.