సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sandeep Reddy Vanga: శిష్యుడి.. వివాహానికి హాజరైన గురువు!

ABN, Publish Date - Oct 31 , 2025 | 10:28 PM

అగ్ర సినీ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) శుక్ర‌వారం వరంగల్‌లో సండి చేశారు.

Sandeep Reddy Vanga

అగ్ర సినీ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) శుక్ర‌వారం వరంగల్‌లో సందడి చేశారు. తన అసిస్టెంట్‌ డైరెక్టర్ అయిన‌ శ్రీకాంత్‌ గండ్ల (Srikanth Gandla) వివాహానికి ఆయ‌న‌ హాజరయ్యారు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ ప్రస్తుతం వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు కూడా ప‌ని చేస్తున్నాడు.

వరంగల్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీ కుటుంబానికి చెందిన కొందరు మిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. సందీప్‌ రెడ్డి వంగా స్వయంగా హాజరై తన శిష్యుడికి ఆశీర్వాదాలు అందించడంతో ఆ వేడుక ప్రత్యేకత సంత‌రించుకుంది.

సందీప్‌ రెడ్డి వంగా పెళ్లికి వ‌చ్చాడ‌ని తెలుసుకున్న అనేక మంది ఆయ‌న‌తో ఫొటోల కోసంపోటీ ప‌డ్డారు. వివాహానికి వ‌చ్చిన వారంతా సందీప్‌ను క‌ల‌వ‌డానికి తాప‌త్ర‌య ప‌డ్డారు. దీంతో ఆ పెళ్లి వేడుక‌కు ఆయ‌న సెంట‌రాఫ్ ఆట్రాక్ష‌న్ అయ్యారు.

Updated Date - Nov 01 , 2025 | 06:30 AM