Samyuktha: ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ అవసరం

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:07 AM

నటి సంయుక్త మీనన్ విశాఖ పట్నంలో కలర్స్ హెల్త్ కేర్ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.

Samyuktha

కలర్స్ హెల్త్ కేర్‌ (Kolors Healthcare) సంస్థ విశాఖపట్నంలోని రామ్ నగర్ లో నూతన శాఖను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కథానాయిక సంయుక్త మీనన్ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఆకర్షణీయమైన విశాఖ ప్రజలకు అందం, ఆరోగ్యం అందించాలనే ఆలోచనలో 'కలర్స్ హెల్త్ కేర్ 2.0'ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను కెరీర్ ప్రారంభించినప్పుడు వెయిట్ లాస్ కు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. హెల్తీ బాడీ అంటే సరైన మజిల్స్ ఉండాలి. నేను కేవలం ట్రెక్కింగ్ కోసం మేఘాలయా వెళ్ళాను. ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ సమస్య కూడా కలగలేదు. ప్రపంచంలో పలుదేశాలు చూడాలి, ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకునే పర్యాటకులకు తప్పని సరిగా హెల్త్ బాగుండాలి. వారంతా హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలి. నాణ్యమైన సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ సంస్థ దేశ వ్యాప్తంగా తన శాఖలను పెడుతుండటం అభినందించదగ్గది' అని అన్నారు.


WhatsApp Image 2025-09-15 at 4.59.21 PM.jpeg

‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, '2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సంతృప్తి పరిచింది. ఆధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. మెడిక‌ల్ కండీష‌న్, ఇంజెక్షన్స్, హెల్త్ పౌడ‌ర్ వంటివి అందించే సేవల‌తో కలర్స్ హెల్త్ కేర్ 2.Oగా అప్‌డేట్ అయింది. దేశవ్యాప్త విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్‌ను ప్రారంభించాం' అని అన్నారు. ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, 'రెండు దశాబ్దాలకుపైగా కస్టమర్ల విశ్వాసం, సంతృప్తి మాకు మ‌రింత నమ్మకాన్ని పెంచింది. వారి అభిలాష మేరకు విశాఖలో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యుఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం' అని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, 'కలర్స్ హెల్త్ కేర్ సేవలను విశాఖపట్నానికి విస్తరించగలగడం ఆనందంగా ఉంది. ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన సంయుక్త మీనన్‌కు ధన్యవాదాలు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి కోరికకు మద్దతుగా కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ నిలుస్తుంది' అని చెప్పారు.

Also Read: Chitragda: పేషన్ తోనే నిర్మాతగా...

Also Read: Dhanush: నకిలీ ఐడీలతో.. హీరోలపై ద్వేషం వెళ్ల‌గ‌క్కుతున్నారు

Updated Date - Sep 16 , 2025 | 11:34 AM