Aditya Music: తెలుగు పాటతో నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:14 PM
ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రి సందర్భంగా ఆదిత్యమ్యూజిక్ కు చెందిన ఓ భక్తిగీతాన్ని షేర్ చేశారు. 'శివరామరాజు' సినిమాలోని ఈ పాటను ఎస్.ఎ. రాజ్ కుమార్ స్వరపర్చగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటను మోదీ షేర్ చేయడం పట్ల ఆదిత్య మ్యూజిక్ సంస్థ కృతజత్ఞలు తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు నవరాత్రి సందర్భంగా ప్రతి రోజూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. వివిధ భాషలకు చెందిన అమ్మవారి పాటలను ఆ శుభాకాంక్షలతో పాటు ఆయన షేర్ చేస్తున్నారు. శనివారం ప్రధాని మోదీ తన ఎక్స్ పోస్ట్ లో 'ఈ రోజు, నవరాత్రి సమయంలో, నేను అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను! ఆమె కృప ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసాన్ని నింపుగాక. భక్తులందరూ ఆమె ఆశీస్సులను పొందుగాక, ఇదే నా కోరిక' అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు ఆయన ఓ పాటను జత చేశారు. విశేషం ఏమంటే అది తెలుగు సినిమా 'శివరామరాజు' (Shiva Rama Raju) కోసం ఎస్.ఎ. రాజ్ కుమార్ (S.A. Rajkumar) స్వరపర్చగా స్వర్గీయ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam) పాడిన పాట. దీన్ని చిర్రావూరి విజయ్ కుమార్ రాశారు. ఈ సినిమా ఆల్బమ్ ను ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) సంస్థ విడుదల చేసింది. అయితే... ఆదిత్య మ్యూజిక్ సంస్థ దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా కోసం స్వరపర్చిన ఈ పాటను దుర్గామాత చిత్రాలతో వీడియో చేసి... యూట్యూబ్ లో పెట్టింది. ఈ పాటనే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన ఎక్స్ అక్కౌంట్ ద్వారా షేర్ చేశారు.
ఆదిత్య మ్యూజిక్ కు చెందిన పాటను ప్రధాన నరేంద్ర మోదీ షేర్ చేయడం పట్ల ఆదిత్య గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. తమ డివోషనల్ కలెక్షన్స్ లోని పాటను నవరాత్రి సందర్భంగా మోదీ స్వీకరించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపింది. మోదీ ఈ పాటను షేర్ చేయడంతో ఇప్పుడది మ్యూజిక్ చార్ట్స్ లో ట్రెండింగ్ లో ఉంది.
Also Read: Mohan Babu - The Paradise: ‘ది ప్యారడైజ్’లో పవర్‌ఫుల్ విలన్‌గా కలెక్షన్‌కింగ్..
Also Read: Varalaxmi Sarathkumar: మెగాఫోన్ పట్టింది..రూట్ మార్చేసింది