సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohanlal: మోహన్ లాల్ తల్లి శాంతకుమారి కన్నుమూత

ABN, Publish Date - Dec 30 , 2025 | 04:26 PM

సీనియర్ నటుడు మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ యేడాది ఆగస్ట్ 10న ఆమె తన 90వ పుట్టిన రోజును కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.

Mohanlal

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) తల్లి శాంతకుమారి (90) మంగళవారం తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఎలమక్కర నివాసంలో ఆమె కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఎలనతూర్ కు చెందిన ఆమె భర్త విశ్వనాథన్ నాయర్ ఉద్యోగ రీత్యా తిరువనంతపురంకు మారారు. విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వంలో లా సెక్రటరీగా పనిచేశారు. చాలా సంవత్సరాల పాటు తిరువనంతపురంలోనే ఉన్న ఆమె ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుండటంతో మోహన్ లాల్ కొచ్చిలోని తన నివాసానికి తీసుకొచ్చారు.


ఈ యేడాది ఆగస్ట్ 10న శాంతకుమారి తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు. తల్లి అంటే అమితమైన ప్రేమ ఉన్న మోహన్ లాల్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార ప్రకటన రాగానే ఆమెను కలిసి ఆశీస్సులు పొందారు. అలానే మదర్స్ డేన ఆమెతో తనకున్న అనుబంధాన్ని తెలియచేస్తూ చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుధవారం శాంతకుమారి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ లాల్ ను సినీ ప్రముఖులు పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచారు.

Updated Date - Dec 30 , 2025 | 04:39 PM