Kajal: కాజల్ చేతుల మీదుగా ‘గోకులం సిగ్నేచర్ జూవెల్స్’ ప్రారంభం
ABN , Publish Date - May 04 , 2025 | 07:54 PM
గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం ఆదివారం వైభవంగా కూకట్‌పల్లిలోని నెక్సెస్ మాల్ సమీపంలో నూతన బ్రాంచ్‌ను అగ్ర కథానాయిక కాజల్ ప్రారంభించారు.
గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ (Gokulam Signature Jewels) ప్రారంభోత్సవం ఆదివారం వైభవంగా కూకట్‌పల్లిలోని నెక్సెస్ మాల్ సమీపంలో నూతన బ్రాంచ్‌ను అగ్ర కథానాయిక కాజల్ (Kajal) ప్రారంభించారు. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పొత్తూరి సుబ్బా రావు, లలిత కుమారి, బాబురావు అన్నారు. భారతీయ మహిళల స్కిన్ టోన్‌కు తగ్గట్టుగాసిల్వర్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘గోకులం సిగ్నేచర్ జువెల్స్’’ షోరూమ్‌లో సిల్వర్ జ్యువలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, వివాహా వేడుకలకు ప్రత్యేక కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డైమండ్ సెట్‌ను ధరించి చూసినప్పుడు చాలా బాగుంది’ అని అన్నారు.
నిర్వాహకులు మాట్లాడుతూ ‘‘కూకట్‌పల్లిలో షోరూమ్‌కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు మమల్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ట్రెండ్ మార్చాం. కస్టమర్లకు న్యూ మోడల్స్, నాణ్యత, మన్నికతో వెండి, వజ్ర ఆభరణాలు అందిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. గాజులు, మంగళ సూత్రం, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం’’ అని అన్నారు.