Dharma Mahesh: భారీ బైక్ ర్యాలీతో గుంటూరులో జిస్మత్ మండీ ప్రారంభం

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:40 AM

టాలీవుడ్ నటుడు జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ గుంటూరులో మరో బ్రాంచ్ ను ప్రారంభించారు.

టాలీవుడ్ నటుడు జిస్మత్ (jismat Mandi) మండీ అధినేత ధర్మ మహేష్ (Dharma Mahesh) గుంటూరులో మరో బ్రాంచ్ ను ప్రారంభించారు. వెయ్యి మంది బైకర్స్ తో భారీ ర్యాలీ నిర్వహించి  తన  మూడో బ్రాంచ్ ను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అతని తల్లి కాకాని అరుణ, తండ్రి వెంకటేశ్వరరావు, సోదరి భాగ్య లక్ష్మి, జిస్మత్ న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది ఎన్ నాగూర్ బాబు పాల్గొన్నారు. మహేష్ జిస్మత్ ప్రయాణం 2017లో గుంటూరులో గిస్మత్ అరబిక్ మండిని ప్రారంభించడంతో ప్రారంభమైంది. దాని నుంచి  ప్రత్యేకమైన జైలు మండి,  అరబిక్ మండి బ్రాంచ్ లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా ఇంటి పేరుగా రూపాంతరం చెందింది. ఎనిమిదేళ్లలో ఈ  బ్రాండ్ 17 కి పైగా శాఖలకు విస్తరించింది. 'కస్టమర్స్ కి  రుచికరమైన భోజనం, బిర్యాని వడ్డించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం' అని ధర్మ మహేష్ అన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, మహేష్ తన యాజమాన్యాన్ని జిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చడం ద్వారా వ్యాపారాన్ని పునర్నిర్మించారు, విస్తృత విస్తరణ కోసం సంస్థను బలోపేతం చేశారు. అతని కంపెనీని గిస్మత్ నుండి జిస్మత్‌ గా రీబ్రాండ్ చేశాడు. కొత్త పేరును తన కుమారుడు జగద్వాజకు అంకితం చేశారు. గుంటూరు ప్రారంభం బ్రాండ్ వృద్ధిని మాత్రమే కాకుండా అతని కుమారుడు జగద్వాజతో భావోద్వేగ ప్రయాణాన్ని కూడా సూచిస్తుందని చెప్పారు. 

ALSO READ:  Anil Ravipudi: చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలతో వస్తున్నాం..

Premante: ప్రేమంటే స్ట్రీమింగ్ ఎక్కడంటే 

Dhandoraa Song: సామాజిక అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నిస్తోన్న ‘దండోరా’ సాంగ్

Pradeep Ranganathan: హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్.. రోజుకు 20 గంటలు

Updated Date - Dec 14 , 2025 | 12:28 PM