Jaihind: ఆపరేషన్ సిందూర్ పై సినీ ప్రముఖుల ప్రశంసలు

ABN , Publish Date - May 07 , 2025 | 12:25 PM

మహిళల నుదుటి సిందూరాన్ని దూరం చేసి మగవాళ్ళను మాత్రమే హతమార్చిన ఉగ్రవాదులకు భారత్ దీటుగా జవాబు చెప్పడం మొదలెట్టింది. దానికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టింది.

పాక్ ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం చేసి దాడికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులను మతం అడిగి మరి మట్టుబెట్టిన ఇస్లాం ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని అప్పటి నుండి భారతీయులంతా ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఒకవేళ యుద్ధమే వస్తే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలకు బుధవారం మాక్ డ్రిల్ ద్వారా తెలియచేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ తో యుద్థం రెండు మూడు రోజుల తర్వాత ఉండొచ్చని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే... ఊహించని విధంగా భారత వైమానిక దళాలు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పాక్ ఆక్రమిత భూభాగంతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి జరపడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వం అధికారికంగా చెప్పిన దగ్గర నుండి వివిధ వర్గాల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. మోదీకి, ఆర్మీకి అండగా ఉంటామని వారంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. తమ సంఘీభావాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు సైతం తన ఆమోదాన్ని, హర్షాన్ని తమదైన శైలిలో తెలుపుతున్నారు.


చిరంజీవి (Chiranjeevi) తన పోస్ట్ లో 'జై హింద్' (Jaihind)అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్స్ లో తన మనసులోని భావాలను ఇలా తెలియచేశారు. 'దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ (Narendra Modi) గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము. జైహింద్!'' అని తెలిపారు.

rj.jpegరజనీకాంత్ (Rajinikanth) ''ఫైటర్స్ ఫైట్ మొదలైంది. మిషన్ పూర్తయ్యే వరకూ ఇది కొనసాగాలి. మొత్తం జాతి అంతా మీవెంటే ఉంది'' అంటూ భారత ప్రధాని మోదీని, భారత రక్షణ శాఖను ట్యాగ్ చేశారు. నటుడు ప్రకాశ్‌ రాజ్ (Prakash Raj) 'భారత ఆర్మీకి సెల్యూట్... ఇండియా ఎప్పుడూ టెర్రరిజాన్ని సహించదు' అని పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ సిందూర్' అనేది సరైన పేరు అని కృష్ణవంశీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ''మోడీజీ రియల్ హీరో, ఆయనకు, భారతీయ ఆర్మీకి సెల్యూట్, వందేమాతరం, ఐ లవ్ భారత్'' అని కృష్ణవంశీ (Krishna Vamsi) ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కుష్‌బూ సుందర్ 'భారత్ మాతాకీ జై... న్యాయం జరిగింది... జై హింద్' అని తన పోస్ట్ లో పేర్కొంది. ప్రముఖ రచయిత, నట దర్శకుడు తనికెళ్ళ భరణి 'సిందూరం... రక్త చందనం! బంధూకం సంధ్యారాగం' అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవితను ఉదహరిస్తూ భారత్ మాతాకీ జై అని పోస్ట్ పెట్టారు.

నటి, బుల్లితెర వ్యాఖ్యాత రష్మీ గౌతమ్ తన మనసులోని భావాన్ని బలంగా తెలిపింది. '' 'మీరు ఉంటున్న దేశాన్ని ప్రేమించండి... లేదా ప్రేమించే దేశంలో మీరు ఉండండి' ఈ మాట ఎవరో చెప్పారో కానీ నూరు శాతం సబబుగా ఉంది'' అని తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

jntr.jpeg

మోదీ, భారత ఆర్మీచర్యలను అభినందిస్తూ అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), నాని, నందమూరి కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, బ్రహ్మాజీ, సంయుక్త, ఆమీర్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, శివ కార్తికేయన్, మోహన్ లాల్, మమ్ముట్టి, మంచు మనోజ్ తదితరులు తమ ఎక్స్ ఖాతాల ద్వారా భారత ప్రభుత్వ చర్యలను సమర్థించారు.

aa.jpg

Also Read: Devika & Danny: కోవై సరళ వచ్చేస్తోంది...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 07 , 2025 | 01:48 PM