సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dharma Mahesh: జిస్మత్ మండీ మరో బ్రాంచ్ ఎక్కడంటే.

ABN, Publish Date - Dec 06 , 2025 | 05:19 PM

సినీ నటుడు ధర్మ మహేష్  జిస్మత్ మండీ రెండవ బ్రాంచ్ ను  చైతన్యపురిలో ప్రారంభించారు.

సినీ నటుడు ధర్మ మహేష్ (Dharma Mahesh) జిస్మత్ మండీ రెండవ (jismat mandi) బ్రాంచ్ ను  చైతన్యపురిలో ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ' నా కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీను  జిస్మత్ మండీగా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందించబోతున్నా. ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము. భోజన ప్రియులకు రుచికరమైన వంటకాలు సర్వ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథులకి  చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయి. రుచి, నాణ్యతతో పాటు కస్టమర్ పట్ల భావోద్వేగమే మాకు ముఖ్యం. దశాబ్దాల పాటు ఈ బ్రాండ్‌ ఉండేలా సర్వీస్ చేస్తాం' అని చెప్పారు. 

Updated Date - Dec 06 , 2025 | 05:19 PM