సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

PG Vinda: నవంబర్ 1, 2 తేదీల్లో.. సినిమాటికా ఎక్స్ పో 2025! వారికి.. అవార్డుల ప్రదానం

ABN, Publish Date - Oct 30 , 2025 | 04:54 PM

సినిమాటికా ఎక్స్ పో మూడో ఎడిషన్ నవంబర్ 1,2 తేదీలలో హైదరాబాద్ లో జరుగుబోతోంది. ఈసారి అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని దీని మేనేజింగ్ డైరెక్టర్ పి.జి. వింద తెలిపారు.

Cinematica Expo 2025

హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవా టెల్ హెచ్.ఐ.సి.సి.లో నవంబర్ 1, 2 తేదీలలో సినిమాటికా ఎక్స్ పో 2025 జరుగబోతోంది. దీని మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. వింద మాట్లాడుతూ, 'సినిమాటికా ఎక్స్పో 2025' ద్వారా ప్రపంచ సినిమా దిశగా మనం అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను 'సినిక క్రియేటర్స్ కౌన్సిల్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, ఇండియా జాయ్ సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజి ఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి.

సినిమాటోగ్రఫీ, వి.ఎఫ్‌.ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్, ఎ.ఐ. ఫిల్మ్‌మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్స్, నెట్‌వర్కింగ్ సెషన్లు జరగనున్నాయి. ఈ సంవత్సరం మా థీమ్ “ఫ్రమ్ హాలీవుడ్ టు హైదరాబాద్: బిల్డింగ్ ది గ్లోబల్ గేట్ వే ఆఫ్ సినిమా'. ఇది కేవలం నినాదం కాదు, భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టే మా దృక్పథం. సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, మరియు కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడం మా లక్ష్యం' అని అన్నారు.


ఈ సంవత్సరం సినిమాటికా ఎక్స్ పో లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని పీజీ విందా తెలిపారు. అలానే నిపుణులచే ఎ.ఐ. సెషన్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎ.ఐ. టూల్ వాడుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని అన్నారు. వచ్చే యేడాది ఫిల్మ్ కార్నివాల్ ఫెస్ట్ ను ఐదు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. దాని కోసం ప్రణాళిక సిద్థం చేస్తున్నామని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంజా శ్రవణ్ మాట్లాడుతూ, 'సినిమాటికా ఎక్స్‌పో, సినీకా క్రియేటర్ కౌన్సిల్ మద్దతుతో భవిష్యత్తులో జీసీసీ మోడల్ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్ లాగా పని చేస్తుందన్నారు. దాని ద్యారా భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన కెమెరాలు, సాఫ్ట్ వేర్స్ అన్ని హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాకుండా అన్ని క్రియేటివ్ ఆర్ట్స్ కి హైదరాబాద్ సిటీనే హాబ్ గా చేయొచ్చని శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

గతంలో జరిగిన రెండు సినిమాటిక ఎడిషన్స్ కు ఎంట్రీ ఉచితంగా ఇచ్చామని దాదాపు 40 వేలకు పైగా సినీ ఔత్సాహికులు అందులో పాల్గొన్నారని శ్రవణ్ తెలిపారు. అయితే ఈసారి కొన్ని అనివార్య కారణాల వలన సినిమాటిక ఎక్స్పో లో ఎంట్రీ అనేది ఫ్రీ గా ఇవ్వలేక పోతున్నామని అన్నారు. సాధారణ పౌరులను కంట్రోల్ చేయడానికి, కేవలం సినీ ఔత్సాహికులను ప్రోత్సాహించడానికి కొద్దిగా ఫీజ్ పెట్టడం జరిగిందని తెలిపారు. అయితే సినీ పరిశ్రమలోని అన్నీ అసోసియేషన్ సభ్యులకి, ఇండస్ట్రీలో పని చేసే వారికి మాత్రం ఎక్స్పో లో ఎంట్రీ పూర్తిగా ఉచితం అని చెప్పారు.

Also Read: Abishan Jeevinth: ద‌ర్శ‌కుడి పెళ్లి.. బ‌హుమ‌తిగా ల‌గ్జ‌రీ BMW కారు

Also Read: Rahul Ravindran: అప్పుడు  రష్మిక విషయంలో చాలా భయమేసింది 

Updated Date - Oct 30 , 2025 | 05:06 PM