Bigg Boss: సామాన్యులకు 'అగ్ని పరీక్ష'

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:56 PM

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో పై బిగ్ డిబేట్ నడుస్తోంది. సీజన్ 9 మొదలు కాక ముందే హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పుడు మొదలు కానుంది? ఎంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు? సామాన్యులను ఎంతమందిని ఎంపిక చేశారనే విషయంపై ఆరా తీస్తూనే ఉన్నారు అభిమానులు.

తెలుగు బిగ్ బాస్ (Bigg Boss 9) రియాలిటీ గేమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో బుల్లితెర ఆడియెన్స్ కి ఓ ఎమోషన్ గా మారిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య జరిగే కొట్లాటను కళ్ళారా చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కొంతమంది పనులను సైతం పక్కన పెట్టి టీవీలకు అతుక్కునేలా చేస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో సందడి చేయనుంది. అందుకోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మొదటితో పోల్చితే టీ.ఆర్.పి. రేటింగ్స్ తగ్గుతున్నా... ఇప్పటికీ 'బిగ్ బాస్' షోను ఇష్టపడేవారు లేకపోలేదు.


ఇప్పటికే బిగ్ బాస్ ఎనిమిది సీజన్లను కంప్లీట్ చేసుకుని తొమ్మిదవ సీజన్ ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ లో కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రోమో షోపై అంచనాలు పెంచింది. ఈ సీజన్ కు కూడా నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ వచ్చిన ప్రోమో షో పై హైప్ ను క్రియేట్ చేసింది. దాంతో ఈ సారి జరిగే ప్రచండ యుద్ధాన్ని తిలకించేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బుల్లితెర అభిమానులు.

దాదాపు మూడు నెలల పాటు జరిగే బిగ్ బాస్ షో లో నటీనటులతో పాటు బుల్లితెర స్టార్స్, సింగర్స్ ను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేస్తారు. వారితో పాటు సామాన్యులకు సైతం అవకాశం ఇస్తారు షో నిర్వాహకులు. అయితే ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కామన్ మ్యాన్ కు అవకాశం కల్పించారు. సామాన్యుల నుంచి వచ్చిన వేలాది అప్లికేషన్స్ లో 40 మందిని మేనేజ్ మెంట్ సెలెక్ట్ చేసిందట. వారిలో ముగ్గురుని మాత్రమే హౌస్ లోకి పంపనుందని తెలుస్తోంది. అయితే ఆ 40 మందిలో బిగ్ హౌస్ లోకి వెళ్లే వారికి అగ్నిపరీక్ష (Agnipariksha) పేరుతో ప్రీషో ను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారిని షో కు సెలక్ట్ చేస్తారు.

సెప్టెంబర్ లో మొదలు కానున్న ఈ షో కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే సామాన్యుల్లో మాత్రం టాప్ త్రీని సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష పేరుతో ప్రీ షోను నిర్వహిస్తున్నారు. దీనికి యాంకర్ శ్రీముఖి (Sreemukhi ) హోస్ట్ గా వ్యవహరించనుంది. 40 మంది కంటెస్టెంట్స్ కు వివిధ టాస్క్ లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆగస్ట్ 23న స్ట్రీమింగ్ కానున్నదట. బిగ్ బాస్ చరిత్రలోనే ప్రీ షో నిర్వహించడం ఇదే మొదటి సారి. దీంతో అడియెన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే 40 మందిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆ ముగ్గురు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

Read Also: War 2 Song: గ్లింప్స్ కే సలామ్‌ అంటే.. మరి పూర్తి పాటకు

Read Also: Allu Arjun: మంచు లక్ష్మీని ఆటపట్టించిన అల్లు అర్హ

Updated Date - Aug 08 , 2025 | 07:10 AM