సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Icon Star: అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్‌

ABN, Publish Date - Oct 13 , 2025 | 01:37 PM

ఫ్యాన్స్ అసోసియేషన్స్ హంగామా చల్లబడుతున్న ఈ తరుణంలో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను బలోపేతం చేసే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారిగా కమిటీలు వేసి వారందరినీ స్వయంగా కలిసి అల్లు అర్జున్ వారిలో ఉత్సాహం నింపుతున్నారు.

Allu Arjun Fans Association

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు అభిమాన గణం బాగానే ఉంది. వారిని ముద్దుగా అల్లు అర్జున్ ఆర్మీ అని సినిమా వాళ్ళు పిలుస్తుంటారు. ఆ మధ్య వరకూ అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదీ ప్రత్యేకంగా లేదు. మెగా ఫ్యాన్స్ (Mega Fans) లోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కలిసి ఉండేవారు. అయితే కొంతకాలంగా అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు. తాను మెగా కుటుంబానికి చెందిన వాడిని కాదని, అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) , అల్లు అరవింద్ (Allu Aravind) వారసుడినని, తనను అలానే గుర్తించాలని అల్లు అర్జున్ భావించే వారు. దానికి తగ్గట్టుగానే ఆయన చర్యలూ ఉండేవి.


ఇదిలా ఉంటే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Allu Arjun Fans Association) ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని మరింత యాక్టివ్ చేసే పనిలో అల్లు అర్జున్ పడ్డాడు. తాజాగా హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అల్లు అర్జున్ కోర్ ఫ్యాన్స్ సమావేశం అయ్యారు. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలను వేశారు. వీరందరినీ స్వయంగా కలుసుకున్న అల్లు అర్జున్... వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో తన ఫ్యాన్స్ అసోసియేషన్ చురుకుగా పనిచేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్టు అర్థమౌతుంది. నిజానికి గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేన్స్ లేవు. కెరీర్ మీద ఫోకస్ పెడుతున్న నేటి యువత... కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ లకే పరిమితం అవుతున్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కటౌట్స్, బ్యానర్స్ పెట్టి హంగామా చేయడం అనేది బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలనుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏదో ఉండే ఉంటుందని కొందరు అంటున్నారు.


అట్లీ సినిమా కోసం భారీ సెట్!

అల్లు అర్జున్, అట్లీ (Atlee) సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, ఇతర ప్రధాన పాత్రధారులపై ఈ సెట్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారట. ఈ సీన్స్ చాలా వైల్డ్ గా ఉంటాయని, ఇందులో అల్లు అర్జున్ గెటప్ భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమా ద్వితీయార్థంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్ లో ఈ యాక్షన్ సీన్ వస్తుందని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథ తిరుతుతుందని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీపికా పదుకొణే నాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది జనం ముందుకు రాబోతోంది.

Also Read: Tuesday TV Movies: మంగళవారం Oct14.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Also Read: Takshakudu: త‌క్ష‌కుడిగా.. ఆనంద్ దేవ‌ర‌కొండ! ఇంత షాకిచ్చాడేంటి

Updated Date - Oct 13 , 2025 | 01:40 PM