The Kerala Story: అదా శర్మ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 13 , 2025 | 01:29 PM
ది కేరళ స్టోరీ, బస్తర్ ది నక్సల్స్ స్టోరీ చిత్రాలు విడుదలైనప్పుడు కొందరు తనను చంపాలనుకున్నారని, అదే సమయంలో తనను కొందరు కాపాడే ప్రయత్నం చేశారని నటి అదాశర్మ తెలిపింది.
పదకొండేళ్ళ క్రితం 'హార్ట్ అటాక్' (Heart Attack) తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అదాశర్మ (Adah Sharma) ... ఆ తర్వాత మరెన్నో చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా భిన్నమైన పాత్రలు చేసింది. హిందీ చిత్రసీమలోకి '1920' మూవీతో ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' (The Kerala Story), 'బస్తర్: ద నక్సల్స్ స్టోరీ' (Bastar: The Naxal Story) చిత్రాలు సంచనలం సృష్టించాయి. ఆ రోజుల్ని ఆమె గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో కొందరు నన్ను చంపాలని చూశారు. అలానే మరికొందరు నన్ను రక్షించాలని చూశారు. ఈ దేశంలో సగం మంది అటు మరో సగం మంది ఇటూ నిలిచారు. ఏదేమైనా వారి ప్రయత్నాలు మాత్రం సరిసమానంగా జరిగాయి' అని సరదాగా వ్యాఖ్యానించింది. వివాదాస్పద కథాంశాలను అంగీకరించడానికి తానెప్పుడు వెనకాడనని, రొటీన్ సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని అదాశర్మ తెలిపింది. అయితే ఒక కథను ఎంపిక చేసుకున్న తర్వాత తాను దానిని మనసారా ఆస్వాదిస్తూ చేస్తానని తెలిపింది. ఏదో ఒక స్పందన ప్రేక్షకుల నుండి తన పాత్రల కారణంగా రావాలని కోరుకుంటానని తెలిపింది. ఈ యేడాద అదా శర్మ నటించిన 'తుమ్ కో మేరీ కసమ్' (Tumko Meri Kasam) మూవీ విడుదలైంది. అలానే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన 'రీటా సన్యాల్' (Reeta Sanyal) సీజన్ 2 రెడీ అవుతోంది.
అదాశర్మ ఇప్పుడు రెండు హారర్ మూవీస్ చేయబోతోంది. అందులో ఒకటి తన తొలి చిత్రం '1920'కి సీక్వెల్. తన తొలి చిత్రం అనుభవాలను అదాశర్మ గుర్తు చేసుకుంటూ నిజానికి అప్పట్లో ఇంత గొప్ప సీజీవర్క్, వీఎఫ్ఎక్స్ లేవు. దాంతో మేమే ఎంతో కష్టపడి ఆ సన్నివేశాలలో నటించాం. ఇవాళ అలాంటి సినిమా తీయడం తేలిక, మరింత గొప్పగానూ అలాంటి కథలను ఇప్పుడు తీయొచ్చని చెప్పింది. అలానే యామి గౌతమ్ తో కలిసి 'తమసూర్' అనే మరో హారర్ మూవీలోనూ అదాశర్మ నటించబోతోంది.
Also Read: Globe Trotter Event: ఎంట్రీ.. వాళ్లకు మాత్రమే! క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
Also Read: SKN: బంగారు తల్లులూ.. వదిలేయాల్సింది చున్నీలు కాదు