సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త‌లసేమియా, రక్తదానాల‌పై.. మ‌రింత అవగాహన అవ‌స‌రం

ABN, Publish Date - Sep 21 , 2025 | 06:24 PM

abhinav-sardhar-blood-donation-birthday టాలీవుడ్ నటుడు అభినవ్ సర్ధార్ తన పుట్టినరోజును హృదయపూర్వకంగా జరుపుకొని, త‌లసీమియా & సికిల్ సెల్ సొసైటీ కోసం ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు.

abhinav

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త అభినవ్ సర్ధార్ తన పుట్టినరోజును ఈసారి సాంప్రదాయ వేడుకలుగా కాకుండా, సమాజ సేవకు అంకితం చేశారు. అభినవ్ సర్ధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, థలసేమియా & సికిల్ సెల్ సొసైటీ కోసం ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమం సెప్టెంబర్ 20, శనివారం, ఉదయం 9:30 గంటలకు ఫిలిం ఛాంబర్, ఫిలిం నగర్ (2వ అంతస్తు) లో ప్రారంభమైంది. సినీ, సామాజిక రంగాల ప్రముఖులు ఈ శిబిరంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రామ్‌కీ మీడియా, సుహర్త్ ఫౌండేషన్, రాజమాత ఫౌండేషన్ విశేష సహకారం అందించాయి. రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సహాయం అందించడానికి, అవగాహన పెంచడానికి అందరూ కలిసివచ్చారు. ఈ సందర్భానికి ముఖ్య అతిథిగా డా. రామచందర్ నాయక్ (ఎంఎల్ఏ, గవర్నమెంట్ విప్ & డిప్యూటీ స్పీకర్), సినీ ప్రముఖులు సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, నటులు శ్రీధర్ రావు, వాసు, శ్రవణ్, మధునందన్, అఖిల్ కార్తీక్, షానీ, సుధీంద్ర, నటీమణులు పాయెల్ ముఖర్జీ, ప్రీతి సుందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ:. "ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థలసేమియా గురించి మరింత అవగాహన పెంచడం, రక్తదానం ఎంత అవసరమో తెలియజేయడం చాలా ముఖ్యం. పుట్టినరోజులు మనకు ఆనందం ఇచ్చే సందర్భాలు. ఆ ఆనందాన్ని సమాజానికి పంచడమే అసలైన వేడుక" అని పేర్కొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 07:25 PM