సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Zootopia 2: కొత్త పాత్రలతో డిస్నీ అదిరే సీక్వెల్.. నవంబర్‌లో థియేటర్లలోకి జూటోపియా 2

ABN, Publish Date - Aug 05 , 2025 | 01:11 PM

వాల్ట్‌ డిస్ని యానిమేషన్‌ స్టూడియోస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘జూటోపియా-2’

Zootopia 2

వాల్ట్‌ డిస్ని యానిమేషన్‌ స్టూడియోస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘జూటోపియా-2’ (Zootopia 2). తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోంది. వచ్చే నవంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ట్రైలర్‌తో పాటు పోస్టర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. 2016లో వచ్చిన మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌హిట్‌ కావడంతో రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సీక్వెల్‌లో కొత్త పాత్రలుగా గ్యారీ డిస్నేక్‌, నిబుల్స్‌, డాక్టర్‌ ఫజ్‌బై పరిచయమవుతున్నారు. ఆస్కార్‌ విజేతలైన జూరెడ్‌ బుష్‌, బైరన్‌ హోవార్డ్‌ దర్శకత్వం వహించారు. యవెట్‌ మెరినో నిర్మాణంలో వాల్ట్‌ డిస్ని యానిమేషన్‌ స్టూడియోస్‌ రూపొందించిన 64వ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలువనుంది. హ్యూమర్‌, ఎమోషన్‌, మిస్టరీతో కూడిన ఈ అడ్వెంచర్‌ను అభిమానులు థియేటర్లలో చూసేందుకు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:11 PM