The Fast and the Furious: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో రొనాల్డో..
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:43 PM
హలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (Fast and the Furious) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
The Fast and the Furious: హలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ (Fast and the Furious) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులు కలిగిన యాక్షన్ ఫ్రాంచైజీలలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మొదట్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు వస్తున్న సిరీస్ లు లేవన్నది నమ్మదగ్గ నిజం. అందుకే చాలామంది ప్రేక్షకులు ఈ ఫ్రాంచైజీని చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. 2023 లో వచ్చిన పాస్ట్ X (Fast X)ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. త్వరలోనే దీనికి పార్ట్ 2 రాబోతుంది. ఎలాగైనా ఈ సారి ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడానికి మేకర్స్ కొత్త ప్రయోగాలు మొదలుపెట్టారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి పాస్ట్ X పార్ట్ 2 కోసం ఫుట్‌బాల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డోని రంగంలోకి దించారని తెలుస్తోంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో భాగమైన నటుడు టైరీస్ గిబ్సన్, గత రాత్రి తన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో సినిమా కాస్ట్‌తో కలిసి రొనాల్డో కూడా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ రాబోయే భాగంలో రొనాల్డో కూడా నటిస్తున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మరోవైపు దీనిపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది సెట్ నుంచి వచ్చిన అధికారిక ఫోటోనా? రొనాల్డో నిజంగా సినిమాలో ఉన్నాడా? అని చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ ఫోటో చూస్తే AI జనరేటెడ్ ఇమేజ్‌లా ఉందని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే రొనాల్డో నిజంగా ఈ మూవీలో కనిపిస్తాడా అనేది మాత్రం ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ, యాక్షన్, థ్రిల్లర్ నిండిన హాలీవుడ్ సినిమాలో రొనాల్డోని చూడాలని ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ కానుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రొనాల్డో కానీ, మేకర్స్ కానీ స్పందించాల్సిందే.