సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Running Man: ది ర‌న్నింగ్ మ్యాన్.. హాలీవుడ్ మూవీ ట్రైల‌ర్ అదిరింది

ABN, Publish Date - Jul 03 , 2025 | 07:10 PM

సినీ ల‌వ‌ర్స్‌కు అదిరిపోయే యాక్ష‌న్‌తో పాటు ఫ‌న్‌, థ్రిల్‌ను అందించేందుకు ఓ డిఫ‌రెంట్ హాలీవుడ్ చిత్రం రెడీ అయింది.

running man

సినీ ల‌వ‌ర్స్‌కు అదిరిపోయే యాక్ష‌న్‌తో పాటు ఫ‌న్‌, థ్రిల్‌ను అందించేందుకు ఓ డిఫ‌రెంట్ హాలీవుడ్ చిత్రం రెడీ అయింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత స్టీఫెన్ కింగ్ (Stephen King) న‌వ‌ల అధారంగా డిస్టోపియ‌న్ బ్లాక్ కామెడీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన‌ ది ర‌న్నింగ్ మ్యాన్ (The Running Man) సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్‌7న ఇంగ్లీష్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్‌ ఈ చిత్రం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

గ్లెన్ పావెల్ (Edgar Wright) హీరోగా విలియం హెచ్. మేసీ (William H. Macy), లీ పేస్, ఎమిలియా జోన్స్, మైఖేల్ సెరా, డేనియల్ ఎజ్రా, సీన్ హేస్, జేమ్ లాసన్, కోల్మన్ డొమింగో, జోష్ బ్రోలిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌తంలో యాంట్ మ్యాన్‌, టిన్‌టిన్ వంటా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ఎడ్గార్ రైట్ (Edgar Wright) ఈ సిన‌మాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు నిర్మాణంలోనూ భాగ‌స్వామిగా ఉన్నాడు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే తీవ్ర అర్థిక క‌ష్టాల్లో ఉన్న హీరోకు డ‌బ్బు చాలా అవ‌స‌ర‌ముండి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెట్టి ఓ గేమ్ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతాడు. ఈ గేమ్ ప్ర‌కారం ప్ర‌పంచ‌మంతా ఉన్న‌ హంట‌ర్స్ ను త‌ప్పించుకుని 30 రోజులు బ‌తికుంటే ల‌క్ష‌ల మిలియ‌న్ డాల‌ర్ల డ‌బ్బు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఉంటుంది. దీంతో హీరో ఆట‌లో అడుగ పెట్టి బ‌తికి బ‌ట్ట క‌ట్టాడా లేదా, హంట‌ర్స్ నుంచి ఏ విధంగా త‌ప్పించుకున్నాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో పోరాటాలు, ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఈ ది ర‌న్నింగ్ మ్యాన్ (The Running Man) సినిమా సాగ‌నుంది. ఈ క్ర‌మంలో తాజాగా రిలీజ్ చేసిన తెలుగు ట్రైల‌ర్ ఓ రేంజ్‌లో ఉండ‌గా చివ‌ర‌గా ఒరేయ్ పంది పిర్ర‌లోడా అంటూ వ‌చ్చే డైలాగులు న‌వ్వులు తెప్పించేలా ఉన్నాయి. మీరూ ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Jul 03 , 2025 | 07:10 PM