Oscars: యూట్యూబ్ లో ఆస్కార్ వేడుక.. ఎప్పటి నుంచి అంటే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:20 AM
ఆస్కార్ (oscars) పురస్కార వేడుక కోసం ప్రపంచ సినీ జనం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. సినిమా రంగానికి ఇదొక ప్రతిష్టాత్మక వేడుక.
ఆస్కార్ (oscars) పురస్కార వేడుక కోసం ప్రపంచ సినీ జనం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. సినిమా రంగానికి ఇదొక ప్రతిష్టాత్మక వేడుక. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది (Oscars 2026). ఆస్కార్ కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ 98వ ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ వీక్షకుల కోసం యూట్యూబ్, అకాడమీ ఓ శుభవార్త చెప్పాయి. మూడేళ్ల తర్వాత అంటే 2029 నుంచి యూట్యూబ్‌లో ఈ వేడుక లైవ్ టెలికాస్ట్ కానుంది. 1976 నుంచి అంటే దాదాపు 50 ఏళ్లగా ఆస్కార్ వేడుక హక్కులు అమెరికాకు చెందిన ‘ABC’ కంపెనీ దగ్గరే ఉన్నాయి.
2028లో 100వ ఆస్కార్ వేడుక తర్వాత నుంచి యూట్యూబ్‌లో ఈ అవార్డు వేడుకను చూడొచ్చు. ఈ మేరకు 2029 నుంచి 2033 వరకూ యూట్యూబ్‌కు ప్రత్యేకమైన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను మంజూరు చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఒప్పందంపై సంతకం చేసింది. మరో మూడేళ్ల తర్వాత ఈ వేడకను ఉచితంగా వీక్షించవచ్చు. రెడ్ కార్పెట్ కవరేజ్ నుంచి తెర వెనక విశేషాల వరకూ చూసే అవకాశాన్ని యూట్యూబ్ ప్రేక్షకులకు అందించనుంది.