One Piece2: విజువల్ వండర్‌గా.. వన్ పీస్ సీజన్2 టీజర్
ABN, Publish Date - Aug 11 , 2025 | 06:21 AM
2023లో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ వెబ్ సిరీస్ వన్ పీస్‌కు సీక్వెల్‌గా మరో సిరీస్ వన్ పీస్ సీజన్2 స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
2023లో వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ వెబ్ సిరీస్ వన్ పీస్‌కు సీక్వెల్‌గా మరో సిరీస్ వన్ పీస్ సీజన్2 (ONE PIECE: Season 2) స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. ఇనాకి గోడోయ్ (Iñaki Godoy), ఎమిలీ రూడ్ (Emily Rudd), మాకెన్యు (Mackenyu), జాకబ్ రొమెరో గిబ్సన్, టాజ్ స్కైలార్, విన్సెంట్ రీగన్ కీలక పాత్రల్లో నటించారు. మాట్ ఓవెన్స్, స్టీవెన్ మేడా ఈ సిరీస్‌ను డెవలప్ చేశారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ టీజర్‌ను చూస్తే మొదటి భాగాన్ని మించి అదిరిపోయే విజువల్స్ తో కళ్లు చెదిరిలే ఉన్నాయి. మోస్ట్ అడ్వెంచర్లతో ఈ రెండో భాగాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.