Stranger Things: స్ట్రేంజర్ థ్రింగ్స్.. ఫినాలే ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Dec 30 , 2025 | 08:42 PM
స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే ట్రైలర్‌ను మంగళవారం రాత్రి విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
2016లో ప్రారంభమై పదేండ్లలో ప్రపంచం అంతా బాగా ఇష్టపడిన, తెగ చూసిన వెబ్ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది స్ట్రేంజర్ థ్రింగ్స్ (Stranger Things). ఇప్పటికే నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు ప్రత్యే ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఎండింగ్ చేరుకుంది.
తాజాగా చివరి సీజన్‌లో చాప్టర్ 1ను నవంబర్‌లో రిలీజ్ చేయగా సెకండ్ ఛాప్టర్ లోని మూడు భాగాలు ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు. చివరి ఛాఫ్టర్‌ను జనవరి 1న రిలీజ్ చేసి ఈ సిరీస్‌కు ఎండ్ కార్ట్ వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపత్యంలో ఫినాలే కు సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం రాత్రి రిలీజ్ చేశారు.
గత ఛాఫ్టర్.. వెక్నా (Vecna)ను అంతమొందించేందుకు సన్నదం అయిన ఎలెవన్, మైక్, డస్టిన్, లూకస్ సహా మొత్తం టీమ్ అన్ని ఏర్పాట్లు చేసుకుని వెక్నా ప్రాంతంలో అడుగుపెట్టడంతో ముగిసింది. ఇక అక్కడి నుంచి ఎలెవన్ టీం అతడిని ఎలా ఎదుర్కొంది, ఎలాంటి పర్యావసనాలు ఎదురయ్యాయి అనే అంశాలతో విజువల్ ఫీస్ట్‌గా కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, ఊహించని ట్విస్టులతో ఈ చివరి భాగం ఉండబోతుందని ట్రైలర్ హింట్ ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇప్పుడే చూసేయండి.