Will Smith: సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కు సన్నాహాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:25 PM
విల్ స్మిత్, టామీ లీ జోన్స్ హీరోలుగా నటించిన 'మెన్ ఇన్ బ్లాక్' ఫ్రాంచైజ్ లో 5వ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను క్రిస్ బ్రేమ్నర్ మొదలు పెట్టినట్టు సోనీ పిక్చర్స్ సంస్థ తెలియచేస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ నటులు విల్ స్మిత్ (Will Smith), టామీ లీ జోన్స్ (Tommy Lee Jones) కాంబినేషన్ లో 1997లో వచ్చిన 'మెన్ ఇన్ బ్లాక్' (Men In Black) మూవీ ఘన విజయం సాధించింది. అందులో ఏజెంట్ జె అండ్ ఏజెంట్ కె గా నటించిన వారిద్దరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. కల్చరల్ ఫినోమినన్ గా నిలిచిపోయిన ఈ సినిమాలోని వారిద్దరి కెమిస్ట్రీ కారణంగా అదే ఫ్రాంచైజ్ లో ఆ తర్వాత మరో నాలుగు సినిమాలు వచ్చాయి. 'మెన్ ఇన్ బ్లాక్' సీరిస్ గా వచ్చిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాల్లో వీళ్ళే నటించారు. 1997 తర్వాత 2002, 2012లో వచ్చిన ఫ్రాంచైజెస్ లో వీరే ప్రధాన పాత్రలు పోషించగా, 2019లో వచ్చిన 'మెన్ ఇన్ బ్లాక్: ఇంటర్నేషనల్'లో మాత్రం వీరు నటించలేదు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు 'మెన్ ఇన్ బ్లాక్' మూవీ సీరిస్ లో 5వ చిత్రానికి రంగం సిద్థమౌతోంది.
సోనీ పిక్చర్స్ (Sony Pictures) సంస్థ రూపొందించిన 'బ్యాడ్ బాయ్స్' సీరిస్ కు వర్క్ చేసిన క్రిస్ బ్రెమ్నర్ 'మెన్ ఇన్ బ్లాక్ 5' కు స్క్రిప్ట్ రాస్తున్నట్టు తెలిపారు. 'బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్' (Bad Boys for Life), 'బ్యాడ్ బ్యాయ్స్ : రైడ్ ఆర్ డై' (Bad Boys: Ride or Die) సీరిస్ లకు ఈయనే పనిచేశారు. సో.... విల్ స్మిత్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇప్పుడు 'మెన్ ఇన్ బ్లాక్ 5'కు స్మిత్ నే తీసుకునే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో స్మిత్ ఉంటే అది వేరే లెవెల్. ఇంతవరకూ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూడు సినిమాల్లో స్మిత్ నటించాడు. అవి వరుసగా 589, 445, 654 మిలియన్ డాలర్స్ ను వసూలు చేశాయి. విల్ స్మిత్ లేకుండా వచ్చిన నాలుగో భాగం కేవలం 250 మిలియన్ డాలర్ల్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. సో... సోనీ సంస్థ ఇప్పుడీ ఐదో భాగం కోసం స్మిత్ నే రంగంలోకి దించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read: Jani Master: డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ భార్య
Also Read: Ram Charan Vs Nani: పెద్ది వర్సెస్ ప్యారడైజ్.. బాక్సాఫీస్ పోరు...