సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Leonardo Dicaprio: టామ్ క్రూజ్‌కు విరుద్ధంగా.. లియోనార్డో డికాప్రియో

ABN, Publish Date - Sep 17 , 2025 | 11:02 PM

తన రాబోయే చిత్రం 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' నటునిగా సంతృప్తి నిచ్చిందని అంటున్నారు లియోనార్డో.

Leonardo Dicaprio

'టైటానిక్' (Titanic) సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన లియోనార్డో డికాప్రియో (Leonardo Dicaprio) విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ సాగుతున్నారు. తన రాబోయే చిత్రం 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) కూడా నటునిగా సంతృప్తి నిచ్చిందని అంటున్నారు లియోనార్డో.

ఇందులో తాను పోషించిన బాబ్ ఫెర్గూసన్ (Bob Ferguson) పాత్ర 'మిషన్ ఇంపాజిబుల్' (Mission Impossible)లో టామ్ క్రూజ్ ధరించిన ఎథాన్ హంట్ (Ethan Hunt) పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని లియోనార్డో తెలిపారు. ఎథాన్ లో దేశభక్తి, దుష్టులను తుదముట్టించే అంశాలు ఉంటే, బాబ్ ఫెర్గూసన్ లో అందుకు విరుద్ధంగా దుష్టలక్షణాలు ఉంటాయనీ లియోనార్డో చెప్పారు.

ఇప్పటి దాకా 'బెస్ట్ యాక్టర్' కేటగిరీలో ఆరు ఆస్కార్ నామినేషన్స్, 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్'గా ఓ సారి ఆస్కార్ నామినేషన్ సంపాదించిన లియోనార్డో 'ద రివెనెంట్' (The Revenant)చిత్రంతో 2016లో ఆస్కార్ ఉత్తమ నటునిగా నిలిచారు. అప్పటి నుంచీ తాను నటించే ప్రతి చిత్రంలో వైవిధ్యం కోసం తపిస్తోన్న లియోనార్డో ఈ సారి 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' పైనా హోప్స్ బాగానే పెట్టుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 26వ తేదీన విడుదల కానుంది.

1990లో థామస్ పైన్చాన్ రాసిన 'వైన్ ల్యాండ్' (Vineland) ఆధారంగా 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' రూపొందింది. పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ సినిమా టీసీయల్ చైనీస్ థియేటర్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ నెల 26న విడుదలయ్యే 'ఒన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ప్రేక్షకులను ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Updated Date - Sep 17 , 2025 | 11:02 PM