సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Justin Bieber: వధువుకి షాకిచ్చిన జస్టిన్‌ బీబర్‌..

ABN, Publish Date - Sep 02 , 2025 | 02:09 PM

జస్టిన్‌ తాజాగా ఓ భారతీయ వధువు (indian girl marriage)పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.

పాప్‌ ఐకాన్‌ జస్టిన్‌ బీబర్‌(Justin Bieber) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంగీత ప్రియులకు ఆయన సుపరిచితమే! కెనడియన్‌ సింగర్‌గా, లిరిసిస్ట్‌గా సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తాడాయన. 15 సంవత్సరాల వయసులోనే తన మొదటి ఆల్బమ్‌ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.  ఈ మధ్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు జస్టిన్‌. తాజాగా ఓ భారతీయ వధువు (indian girl marriage)పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పెళ్లి వేడుకలో జస్టిన్‌ బీబర్‌ను చూసిన ఆమె ఆశ్చర్యంతో అరుపులు, కేకలతో కళ్యాణ వేదికను హోరెత్తించింది.

అసలు విషయం ఏంటంటే.. ఆగస్ట్‌ 31న లాస్‌ ఏంజిల్స్‌లో ఓ భారతీయ మహిళ తన వివాహాన్ని బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకొంది. ఈ వివాహానికి ఊహించని గెస్ట్‌గా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌. తన పెళ్లికి ఎవరు ఊహించని బహుమతి లభించే సరికి ఆ అమ్మాయి ఆనందంతో ఉబ్బితబ్బి అవుతుంది.. ఇకపోతే జస్టిన్‌ బీబర్‌ పెళ్లి కూతుర్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆ పెళ్ళికి హాజరైన అతిథులు కూడా ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సింపుల్‌ లుక్‌లో వైట్‌ టీ షర్టు బ్లూ కలర్‌ కోట్‌ వేసుకొని కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. పెళ్లి కూతురితోపాటు స్నేహితులు కూడా జస్టిన్‌ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.  ‘ఇతడు చాలా గొప్పవాడు’ అని ఓ ఫ్యాన్‌ కామెంట్‌ చేస్తే.. మరొకరు పెళ్లి కూతురు చాలా అదృష్టవంతురాలు.. తన జీవితంలో మర్చిపోలేని వివాహ బహుమతిని అందుకుంది’ అని కామెంట్‌ చేశారు. ‘అయ్యో.. ఇది చాలా అద్భుతమైన ఘటన. నేను ఆమె స్థానంలో ఉంటే ఏడుస్తూ ఉండేదాన్ని’ అని ఒకరు, ‘దయచేసి నా పెళ్ళికి కూడా రండి’ అంటూ మరొకరు పోస్ట్‌ చేశారు. జస్టిన్‌ బీబర్‌ సర్‌ప్రైజ్‌ చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ హై ప్రొఫైల్‌ వివాహ విందుకు ఆయన భారతదేశానికి కూడా వచ్చారు. అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ సంగీత్‌ లో ప్రదర్శన ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.  

Updated Date - Sep 02 , 2025 | 02:25 PM