సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Matthew McConaughey: ఇంటర్ స్టెల్లార్.. స్టార్‌కి ఏమైంది

ABN, Publish Date - Sep 17 , 2025 | 07:06 PM

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన 'ఇంటర్ స్టెల్లార్' చూసిన వారికి హీరో మ్యాథ్యూ మెక్ కనే గుర్తుండే ఉంటారు.

Matthew McConaughey

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన 'ఇంటర్ స్టెల్లార్' (Interstellar)(2014) చూసిన వారికి అందులో హీరోగా నటించిన మ్యాథ్యూ మెక్ కనే (Matthew McConaughey) గుర్తుండే ఉంటారు. ప్రస్తుతం మ్యాథ్యూ వెలువరించిన 'పోయెమ్స్ అండ్ ప్రేయర్స్' (Poems And Prayers) బుక్ అభిమానులను ఆకర్షిస్తోంది. అందులో తాను 'మారిజువానా అడిక్షన్' (Marijuana Addiction)తో ఎలా బాధ పడింది వివరించారు. దీనినే 'వీడ్ అడిక్షన్' అనీ పిలుస్తారు.

అలాగే 'కన్నబీస్ యూజ్ డిజార్డర్' (Cannibis Use Disorder) అనీ అంటారు. ఫైబర్ ను డెవలప్ చేయడానికి 'కన్నబీస్'ను ఉపయోగిస్తారు. దీని వాడకం తాత్కాలికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అయితే దీని వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదమూ ఉంది. మ్యాథ్యూ 'వీడ్ అడిక్షన్'తో బాధ పడ్డారు. దాంతో తన బర్త్ డేను కూడా జరుపుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ 'కన్నబీస్ యూజ్ డిజార్డర్' వల్ల మెల్లగా శరీరం సత్తువ కోల్పోతుంది. కొన్ని భాగాలు పక్షవాతానికి గురయ్యే అవకాశమూ ఉంటుంది.

ఓ సందర్భంలో ఈ వ్యాధి ప్రకోపించి మ్యాథ్యూ కొన్ని గంటల పాటు కారులోనే గడపాల్సి వచ్చింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి! ఆ సమయంలో జానెట్ జాక్సన్ (Janet Jackson) సంగీతం వింటూ గడపానని తన పుస్తకంలో వివరించారు మ్యాథ్యూ. ఒకానొక సమయంలో 'మెక్సికన్ డైరెక్ట్ వీడ్' (Mexican Direct Weed) అని పిలిచే మారిజువానాకు తాను బానిసనయ్యానని మ్యాథ్యూ తన తాజా పుస్తకంలో అంగీకరించారు.

వీడ్ ను తాను సిగరెట్ లా చేసుకొని తాగుతూ ఉండడం వల్ల కొన్నాళ్ళు ఉత్తేజం కలిగినా తరువాత శరీరం చచ్చుబడిపోయిందనీ వివరించారు. ఓ సారి కారులో వస్తూండగా ఈ డిజార్డర్ కారణంగా కదలికలు లేకుండా పోయాయని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలన్న సంకల్పంతోనే ఈ పుస్తకం వెలువరించినట్టు మ్యాథ్యూ తెలిపారు. ఏది ఏమైనా హీరో బ్రతికి బట్టకట్ట గలిగాడు అంతే చాలు అంటున్నారు ఫ్యాన్స్.

Updated Date - Sep 17 , 2025 | 07:06 PM