Mortal Kombat2: బాక్సులు.. బద్దలయ్యే సినిమా వచ్చేస్తోంది
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:54 AM
ప్రపంచ సినీ లవర్స్, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల పిచ్చి ఉన్న వారిని అలరించేందుకు మరో ఇంగ్లీష్ చిత్రం ముస్తాబయింది.
ప్రపంచ సినీ లవర్స్, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల పిచ్చి ఉన్న వారిని అలరించేందుకు మరో ఇంగ్లీష్ చిత్రం ముస్తాబయింది. అయితే.. ఈసారి ఎప్పటిలా వచ్చే యాక్షన్, అడ్వెంచర్, సోసియో ఫాంటసీ కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఫాంటసీ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు వస్తోంది. ఆ సినిమానే మోర్టల్ కోంబాట్ II (Mortal Kombat2). 2021లో వచ్చిన మోర్టల్ కోంబాట్ (Mortal Kombat) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఎడ్ బూన్ జాన్ టోబియాస్ క్రియేట్ చేసిన మోర్టల్ కోంబాట్ అనే వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని న్యూ లైన్ సినిమా (New Line Cinema) నిర్మించగా, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సైమన్ మెక్‌క్వాయిడ్ (Simon McQuoid) ఈ సీక్వెల్‌కు సైతం దర్శకత్వం వహించాడు. కార్ల్ అర్బన్, అడెలైన్ రుడాల్ఫ్, జెస్సికా మెక్‌నామీ, జోష్ లాసన్, లూడి లిన్, మెహ్కాద్ బ్రూక్స్, టాటీ గాబ్రియెల్ వంటి తారలు నటించారు.
అయితే.. ఈ చిత్ర దర్శకుడు ఆమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలలో సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చారు. మొదటి పార్ట్‌లో రివీల్ చేయని మెయిన్ క్యారెక్టర్ జాన్ కేజ్ ఈ మూవీలో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 90లలో నాటి మోర్టల్ కోంబాట్ సినిమాల్లోని ఎలాంటి పవర్స్ లేని మూవీ హీరో పాత్రను ఇందులో తీసుకు వస్తున్నట్లు వివరించారు. అంతేగాక ఈ సినిమాను ఫ్రాంజైజీగా రూపొందిస్తామని, ఈ సిరీస్‌లో మరో ఐదారు సినిమాలు ఇందులో వస్తాయని, అనేక నూతన లేడీ పాత్రలు కూడా సృష్టిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మొదటి పార్ట్ ను మించి కళ్లు చెదిరే విజువల్స్, పోరాట దృశ్యాలు, సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్, రాజులు, రాజ్యాలు, డీమన్స్, యుద్దాలు ఇలా అనేక క్యారెక్టర్లు ఇందులో దర్శణమిచ్చాయి. కాగా ఈ సినిమా ఈ సంవత్సరం ఆక్టోబర్24న వార్నర్ బ్రదర్స్ ద్వారా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో అయా ప్రధాన ప్రాంతీయ లాంగ్వేజీల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తే ఇటీవల హాలీవుడ్ సినిమాల మాదిరే తెలుగు డైలాగ్స్ అదిరిపోయేలా, కామెడీ పంచేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇప్పుడే చూసేయండి.