Pakeezah: వృద్థాశ్రమంలో చేరిన.. నటి పాకీజా
ABN, Publish Date - Dec 13 , 2025 | 10:16 AM
హాస్య నటి వాసుకి (పాకీజా) దీనస్థితిలో ఉన్నారు. ఇటీవల ఆమె ఓ వృద్థాశ్రమంలో చేరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్థాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.
హాస్య నటి వాసుకి (పాకీజా - Pakeeza) దీనస్థితిలో ఉన్నారు. ఇటీవల ఆమె ఓ వృద్థాశ్రమంలో చేరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్థాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో మోహన్‌బాబు సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో ( తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, పుణ్యభూమి నాదేశం తదితర సినిమాల్లో నటించారు. తర్వాత అవకాశాలు తగ్గాయి. కొన్ని పరిణామాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో ఇబ్బంది పడుతూ జీవితం సాగిస్తున్న ఈ ఆమె గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం వల్ల శ్రీరామ వృద్థాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు.
ఈ సందర్భంగా పాకీజా మాట్లాడుతూ.. ‘నన్ను వెండితెరకు పరిచయం చేసిన గురువు మోహన్‌బాబు కుటుంబం రుణ తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహాయం అందిస్తున్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. జిల్లా కలెక్టర్.. పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేేస్త కాస్త ఆదుకున్నవారవుతారు. ఆశ్రమంలో ఉంటున్న వృద్థులకు నా వంతు సేవ చేస్తున్నా. ఇక్కడకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కాస్త బావుంది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఆప్యాయతలు ఎప్పటికీ మరువలేను’ అని అన్నారు.