సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Bride: టీజ‌రే.. ఈ రేంజ్‌లో ఉంది! మ‌రి సినిమా..

ABN, Publish Date - Sep 24 , 2025 | 10:29 AM

ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ భారీ చిత్రం ది బ్రైడ్ థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

The Bride

ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో హాలీవుడ్ భారీ చిత్రం ది బ్రైడ్ (The Bride) త్వ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గ‌తంలో ఆస్కార్ నామినేట్ అయిన ది లాస్ట్ డాటర్ రచయిత,-దర్శకురాలు మాగీ గిల్లెన్‌హాల్ (Maggie Gyllenhaal) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

ఆస్కార్ విజేత క్రిస్టియన్ బేల్ (Christian Bale), ఐదు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన జెస్సీ బక్లీ (Jessie Buckley), పీటర్ సార్స్‌గార్డ్, జేక్ గిల్లెన్‌హాల్, పెనెలోపీ క్రూజ్ (Penélope Cruz), అన్నెట్ బెనింగ్ (Annette Bening) వంటి తారలు కీ రోల్స్ చేస్తున్నారు.

1930 చికాగో నేపథ్యంలో సాగే ఈ కథలో ఒంటరిగా జీవించే ఫ్రాంకెన్‌స్టైన్‌ (క్రిస్టియన్ బేల్) తనకో సహచరిని సృష్టించమని శాస్త్రవేత్త డాక్టర్ యూఫ్రోనియస్‌ (అన్నెట్ బెనింగ్)రి అడుగుతుంది. దీంతో ఇద్దరూ కలిసి అప్ప‌టికే హత్యకు గురైన ఓ యువతికి తిరిగి ప్రాణం పోసి ‘ది బ్రైడ్’ (జెస్సీ బక్లీ)ని సృష్టిస్తారు.

కొద్దికాలం అంతా స‌జావుగా ఉంది అనుకునే లోపు బ్రైడ్ మ‌రో విధంగా మారి చేసే ప‌నులు, ర‌క్త‌పాతం, అన్నీ ఊహంక‌ద‌ని విధంగా ఉండి ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజ‌ర్ చూస్తే ఈ వివ‌రాల‌న్నీ అర్థ‌మ‌వుతాయి. మార్చి 6, 2026న ఈ మూవీ (The Bride ) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Sep 24 , 2025 | 10:29 AM