సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Avatar 3: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే.. చతికిలపడ్డ అవతార్ 3

ABN, Publish Date - Dec 22 , 2025 | 10:15 PM

అవతార్ (Avatar).. రెండుసార్లు దుమ్మురేపింది. ప్రపంచంతో సలాం కొట్టించుకుంది. సినిమా అంటే ఇదిరా.. విజువల్ అంటే ఇదిరా అని చప్పట్లు కొట్టించుకుంది.

Avatar 3

Avatar 3: అవతార్ (Avatar).. రెండుసార్లు దుమ్మురేపింది. ప్రపంచంతో సలాం కొట్టించుకుంది. సినిమా అంటే ఇదిరా.. విజువల్ అంటే ఇదిరా అని చప్పట్లు కొట్టించుకుంది. ఊహించనన్ని రికార్డులు సాధించింది. కానీ అదే ఫ్రాంచైజీలో వచ్చిన మూడో మూవీ మాత్రం ముందుకు సాగలేక ఆపసోపాలు పడుతోంది.

ఆలోవర్ వరల్డ్.. ఆడియెన్స్ లో మోస్ట్ క్యూరియాసిటిగా నిలిచిన ఫ్రాంచైజీ ఏదంటే. అది కచ్చితంగా అవతార్ అనే చెప్పాలి. మొదటి రెండు భాగాలు సాధించిన విజయం, బాక్సాఫీస్ రికార్డులు చూస్తే... మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ 2025లో భారీ వసూళ్లు సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. ఈ ఏడు అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని లెక్కలుగట్టారు. కానీ ఊహించని విధంగా అది తారుమారు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అవతార్ మూడో పార్ట్.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 137 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కానీ ఈ నెంబర్ ఈ ఏడాది అతిపెద్ద ఓపెనింగ్‌ను అధిగమించలేకపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు యానిమేషన్ చిత్రమైన ‘జూటోపియా 2’ మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. నవంబర్ 26న విడుదలైన ‘జూటోపియా 2’ 150 మిలియన్ డాలర్లతో దుమ్ము రేపింది. కానీ అవతార్ 3 దాన్ని అధిగమించకపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.

భారీ అంచనాలతో వచ్చిన అవతార్ 3 నార్త్ అమెరికాలో చతికిల పడింది. ప్రీమియర్ షోలతో కలిపి కేవలం 36 మిలియన్ డాలర్లే వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లలో 100 మిలియన్లతో బాగానే స్టార్ట్ అయినా, మొత్తం ఓపెనింగ్‌లో ‘జూటోపియా 2’ను అందుకోలేకపోయింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. 2022లో వచ్చిన అవతార్: 2 మొదటి రోజు సాధించిన 441 మిలియన్ డాలర్లలో సగం కూడా ఈ మూడవ భాగం సాధించలేకపోయింది. మొదటి రెండు చిత్రాలు పూర్తి రన్‌లో 2 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించిన క్రమంలో, ‘ఫైర్ అండ్ యాష్’.. దాన్ని అందుకోవాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంది. అది జరగాలంటే వీక్‌డేస్‌లో బాగా నడవాలి, రాబోయే క్రిస్మస్ సెలవల్లో దూకుడు చూపించాలి. మరి అవతార్ 3 ముందు ముందు ఎలాంటి కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Updated Date - Dec 22 , 2025 | 10:15 PM