Avatar 2: అవతార్ 2.. మంత్ర ముగ్దులవుతారు..
ABN, Publish Date - Sep 30 , 2025 | 12:30 PM
‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న త్రీడీ ఫార్మెట్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా వారం రోజులు మాత్రమే థియేటర్‌లతో ఉందనుంది.
హాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’. దీనికి కొనసాగింపుగా ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of water) చిత్రం వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా అవతార్:‘ఫైర్ అండ్ యాష్’ కూడా త్వరలో తెరపై సందడి చేయనుంది. అయితే ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న త్రీడీ ఫార్మెట్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా వారం రోజులు మాత్రమే థియేటర్‌లతో ఉందనుంది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ త్రీడీలో చూడటం ద్వారా పండోరా అద్భుతమైన అండర్ వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ, హృదయానికి హత్తుకునే కథను బిగ్‌స్ర్కీన్‌పై చూడటం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. విజువల్ స్పెక్టాక్యులర్‌గా 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టి హాలీవుడ్ సినిమాగా ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. అంతే కాదు బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ‘అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ పంచే ‘అవతార్-2’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ స్ర్కీన్‌పై త్రీడీ ఫార్మెట్‌లో ఈ చిత్రం మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. పండోర గ్రహం విజువల్స్‌కు మంత్ర ముగ్దులవుతారు. మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. త్వరపడండి.. ఈ అవకాశం వారం రోజులు మాత్రమే’ అని పేర్కొన్నారు.
Story:
భూమి నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన జేక్ (సామ్ వర్తింగ్టన్) అక్కడే ఓ తెగకి చెందిన నేతిరి (జో సల్దానా)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వారసత్వంతో ఆ తెగకు నాయకుడై నడిపిస్తుంటాడు. జేక్ దంపతులకు లోక్, నేటియం, టూక్ ముగ్గురు పిల్లలు. వీరు కిరీ, స్పైడర్ అనే మరో ఇద్దరినీ కూడా దత్తత తీసుకుంటారు. మరోవైపు భూమి అంతం అయిపోతుందని పండోరాలో తెగను అంతం చేసి ఆక్రమించుకోవాలని చూస్తుంటారు మనుషులు. దీంతో జేక్ కుటుంబంతో సహా మెట్ కైనా ప్రాంతానికి చేరుకుంటాడు. సముద్రమే తమ జీవితాలుగా బతికే ఆ ప్రాంతానికి రాజు టోనోవరి. అతని సహకారంతో జేక్ అక్కడి వారితో అనుబంధం పెంచుకుంటాడు. వారితో కలిసి తమను అంతం చేయడానికి వచ్చిన శత్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్)తో ఎలా పోరాటం చేశారనేదే ఈ కథ.