Solo boy review: సోలో బాయ్ రివ్యూ
ABN, Publish Date - Jul 04 , 2025 | 08:16 PM
బిగ్‌బాస్ షోతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు గౌతమ్ కృష్ణ. అంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్ షోతో ఫామ్‌లోకి వచ్చాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సోలో బాయ్’.ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ: సోలో బాయ్ (Solo boy Review)
విడుదల తేది: 4–7–2025
బిగ్‌బాస్ షోతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు గౌతమ్ కృష్ణ. (Goutham Krishna) అంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్ షోతో ఫామ్‌లోకి వచ్చాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి(Ramya Pasupuleti), శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ నిర్మించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ: (Solo boy Review)
కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ) మఽధ్య తరగతి యువకుడు. తల్లిదండ్రులు(పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి) అతన్ని ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుతారు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఉద్యోగం వచ్చాక.. పెళ్లి చేసుకుందామని ప్రియని అడగ్గా.. ‘నా డ్రైవర్‌కి కూడా నీ కంటే ఎక్కువ జీతం వస్తుంది’ అని అవమానించి బ్రేకప్ చెబుతుంది. ఆ బాదతో కృష్ణమూర్తి తాగుడుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరిన కృష్ణమూర్తి జీవితంలోకి శ్రుతి (శ్వేత అవస్తి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. తండ్రి మరణం, భార్యతో విడాకులు వీటన్నింటినీ తట్టుకుని కృష్ణమూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే సోలోబాయ్ కథ.
విశ్లేషణ:
ఓ మధ్య తరగతి కుర్రాడు చేతిలో రూపాయి లేని సమయంలో కష్టం, తెలివి తేటలతో తాను అనుకున్నది ఎలా సాధించాడు? ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేదే సోలోబాయ్ కథ. ఈ మధ్యన యంగ్‌స్టర్స్ నటించిన చాలా చిత్రాలు ఇలాంటివే. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని అలాగే మిగిలిపోయాయి. కథ రొటీన్‌దే అయినా ఆ రొటీన్ వాసన తెలియకుండా తెరకెక్కించాడు దర్శకుడు. కథనం కొత్తగా, ఆసక్తికరంగా మలిచాడు. మధ్య తరగతిలో ఉండే బాధలు, అవమానాలు తెరపై కళ్లకు కట్టిన్లు చూపించారు. కాలేజీలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ సీన్స్, హీరోకి ఎదురైన ఇబ్బందులను అధిగమించి నిలబడటాన్ని దర్శకుడు హృద్యంగా చూపించాడు. కాలేజీలో సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌లో కృష్ణమూర్తి కాలేజీ లైఫ్.. పెళ్లి..విడాకులు చుట్టు తిరుగుతుంది. సెకండాఫ్‌లో కృష్ణమూర్తి ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేని చూపించారు. మధ్యలో దళారి వ్యవస్థ రైతులను ఎలా మోసం చేస్తుందనే పాయింట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ రొటీన్‌లోకి వెళ్లిపోయాడు దర్శకుడు. నటీనటుల విషయానికొస్తే.. కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ కృష్ణ చక్కని నటన కనబర్చాడు. గత చిత్రాలతో కంపేర్ చేస్తే నటనలో కొత్తదనం చూపించాడు. ప్రియా క్యారెక్టర్‌లో రమ్య పసుపులేటి సినిమాలో కనిపించే స్ర్కీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ ఇంపాక్ట్ ఉన్న పాత్ర. శ్వేత అవస్తి మంచి పర్ఫామెన్స్‌తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి హీరోకు తల్లిదండ్రులుగా ఒక మధ్య తరగతి కుటుంబ సభ్యులుగా నటించారు. అలాగే భద్రం, షఫీ, చక్రపాణి పాత్రల పరిధి మేరకు నటించారు. పాటలు సందర్భానుసారంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆర్‌ఆర్ అద్భుతంగా కుదిరింది. చిన్న బడ్జెట్ చిత్రమే అయినా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంటే బావుండేది. కెమెరా పనితనం బావుంది. దర్శకుడు రాసుకున్న కథ యువతకు కనెక్ట్ అవుతుంది. ఇందులో హీరో అనుకున్నది సాధించడానికి ఎంతగా కృషి చేసిన తీరు యువతలో స్ఫూర్తి నింపుతుంది. కుటుంబ విలువలు, స్నేహబంధానికి సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ట్యాగ్‌లైన్: ఇన్‌స్పైరింగ్ సోలో బాయ్
రేటింగ్: 2.75/5