సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Santhana prapthirasthu: 'సంతాన ప్రాప్తిరస్తు' రివ్యూ

ABN, Publish Date - Nov 14 , 2025 | 02:25 PM

విక్రాంత్‌, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర ఎంటర్‌ టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. షేక్‌ దావూద్‌ జి స్ర్కీన్‌ ప్లే అందించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే!

సినిమా రివ్యూ: సంతాన ప్రాప్తిరస్తు (Santhana prapthirasthu Review)
విడుదల తేది:
14-11-2025

విక్రాంత్‌(vikranth), చాందిని చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ . 'మధుర ఎంటర్‌ టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. సంజీవ్‌ రెడ్డి దీనికి దర్శకుడు. షేక్‌ దావూద్‌ జి స్ర్కీన్‌ ప్లే అందించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే!

కథ:

చైతన్య (విక్రాంత్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్. తన స్నేహితుడు సుబ్బు (అభినవ్‌ గోమటం)తో గ్రూప్‌ వన్‌ ఎగ్జామ్స్‌ రాయించేందుకు వెళ్లగా, అక్కడ కళ్యాణి (చాందినీ చౌదరి) తారస పడుతుంది. ఆమె వరంగల్‌లో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యి హైదరాబాద్‌లో ఎగ్జామ్స్‌ రాయడానికి వస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. మ్యాట్రిమోనీలో ఆమె ప్రొఫైల్‌ చూసి కలవడానికి వరంగల్‌ వెళ్తాడు. అక్కడ ఈశ్వరరావు మాస్టర్‌ (మురళీధర్‌ గౌడ్‌) చైతన్యతో మాటామాటా కలిపి అతని అలవాట్లు మొత్తం తెలుసుకుంటాడు. అలాంటి వాడికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయకూడదనుకుంటాడు.  జాక్‌ (తరుణ్‌ భాస్కర్‌) సాయంతో చైతన్య, కళ్యాణి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ కోపంతో తండ్రి తన కూతురు ఇంటి గుమ్మం కూడా తొక్కడు. కొన్నాళ్లకు అంతా సెట్‌ అయ్యి.. కూతురు ఇంటికి వచ్చి అల్లుడికి, కూతురుకి మధ్య దూరం పెంచి ఆమెను వెనక్కి తీసుకెళ్లి, మళ్లీ పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆయన ఏం చేశాడు? చైతన్య, కళ్యాణి మధ్య దూరం పెరిగిందా? చైతన్య మీద కళ్యాణి ఎందుకు కోపం పెంచుకుంది? కళ్యాణికి అతను దూరం కావాలని ఎందుకు అనుకున్నాడు? ఫైనల్‌గా ఏం జరిగింది అన్నది మిగతా కథ.


విశ్లేషణ: (Santhana prapthirasthu Review)
ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట మధ్య భర్త లోని చిన్న లోపం కారణంగా పిల్లలు కలగకపోవడంతో ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయనే ఇతివృత్తంతో సాగిందీ సినిమా. చిన్న చిన్న సమస్యలు, దాపరికాలు భార్యాభర్తల మధ్య ఎలా దూరం పెంచుతాయనే అంశాన్ని దర్శకుడు ఎమోషనల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌ అంతా సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌, హీరోహీరోయిన్‌లా ప్రేమాయణం, పెళ్లి, స్నేహితులతో చిల్లింగ్‌ మోమెంట్స్‌తో సోసోగా సాగింది. ఇక సెకెండాఫ్‌ హీరోకి వీర్య కణాలు తక్కువ ఉండటం... దాని నుంచి ఎదురైన సమస్యలు, ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి... ఇలా ఎమోషనల్‌ కంటెంట్‌తో నడిచింది. అయితే మూవీ ప్రమోషనల్‌ కంటెంట్‌ను బట్టి ఐవీఎఫ్‌ సెంటర్ల గురించి సినిమాలో ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. బట్... అది ఇందులో చిన్న ఎపిసోడ్‌ మాత్రమే. ఫర్టిలిటీ సెంటర్స్‌ దోపిడీని చూపిస్తూనే, మరోపక్క దానివల్లే సంతానం కలిగినట్లు చూపించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే..

విక్రాంత్‌ సాప్ట్‌వేర్‌ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. కానీ ఫ్యామిలీ పర్సన్‌గా తేలిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో చిన్న వెలితి అనిపిస్తుంది. తెలుగమ్మాయి చాందినీ చౌదరి... కళ్యాణి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సెంటిమెంట్ సీన్స్ లో రక్తికట్టించింది.  హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. చాందిని పాటల్లో కాస్త రొమాంటిక్‌ టచ్‌ కూడా ఇచ్చింది. హీరోయిన్ తండ్రి పాత్రకు మురళీధర్‌ గౌడ్‌ న్యాయం చేశారు. అభినవ్‌ గోమటం, జీవన్‌, 'వెన్నెల' కిశోర్‌ ట్రాక్‌ నవ్వులు పూయించింది. మహిరెడ్డి కెమెరా వర్క్‌ క్వాలిటీగా ఉంది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం ఫర్వాలేదనిపించింది. ఓ పాట వినడానికి, చూడటానికి కూడా బావుంది. ఫస్టాఫ్‌ ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా ఉంటే మరింత బావుండేది. నిర్మాణ విలువలు ఓకే. ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి.  దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ కథను రాసుకున్నారు. ఇది కాస్త సీరియస్‌ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్‌ క్రాస్‌ చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా లైటర్‌ వేలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే లవ్‌స్టోరీ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుంది. పిల్లల్ని కోరుకోవడం, ఆ తరుణంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు, పతాక సన్నివేశం కదిలించేలా ఉన్నాయి. కథ పరంగా మంచిదే అయినా కాస్త ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లతో తీసుంటే ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లేది. ప్రమోషన్‌ బలంగా చేస్తే జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది.
ట్యాగ్‌లైన్‌:  నవ్వుల ప్రాప్తిరస్తు!
రేటింగ్‌: 2.75 /5

Updated Date - Nov 14 , 2025 | 02:45 PM