Vijay Devarakonda: ఎంతో సంతోషంగా ఉంది

ABN, Publish Date - May 31 , 2025 | 04:48 AM

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నటప్రపూర్ణ కాంతారావు స్మారక పురస్కారం పొందడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ‘పెళ్లిచూపులు’ సినిమాకు రెండో ఉత్తమ చిత్రం అవార్డు దక్కినందుకు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Vijay Devarakonda: ఎంతో సంతోషంగా ఉంది

Vijay Devarakonda: ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నటప్రపూర్ణ కాంతారావు గారి స్మారక పురస్కారం నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ చిత్రానికి రెండో ఉత్తమ చిత్రం పురస్కారం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.

Updated Date - May 31 , 2025 | 07:02 AM