కొంత డోస్‌ తగ్గించా

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:25 AM

జయాపజయాలతో సంబంధం లేకుండా, ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు నటుడు వెంకటేశ్‌. కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు కూడా...

జయాపజయాలతో సంబంధం లేకుండా, ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు నటుడు వెంకటేశ్‌. కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి గుర్తింపు కూడా పొందారు. అయితే 2023లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ వెంకటేశ్‌ ఇమేజ్‌ను కొంతవరకు డ్యామేజ్‌ చేసింది. ఇందులో అనేక సన్నివేశాలు బోల్డ్‌గా ఉండటంతో పాటు, వెంకటేశ్‌తో అసభ్య సంభాషణలు పలికించడం వివాదాస్పదమైంది. వెంకటేశ్‌ లాంటి ఫ్యామిలీ హీరో బోల్డ్‌ కంటెంట్‌లో నటించడం, అభ్యంతరకరమైన డైలాగ్స్‌ చెప్పడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దానిపై అనేకసార్లు వెంకటేశ్‌ సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. ‘రానా నాయుడు సీజన్‌ 2’ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపారు. కాగా, ఇటీవలె సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కి రప్పించి అతిపెద్ద విజయాన్ని వెంకటేశ్‌ అందుకున్నారు. ఇప్పుడు ‘రానా నాయుడు-2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఇటీవల నిర్వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌ మీట్‌లో ‘రానా నాయుడు-2’పై వెంకటేశ్‌ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్‌ సీజన్‌పై వచ్చిన విమర్శల దృష్ట్యా... సీజన్‌-2లో కొంత డోస్‌ తగ్గించినట్లు చెప్పారు. సీజన్‌ 2లో అర్జున్‌ రాంపాల్‌, కృతి కర్బందా కనిపించనున్నారు.


Also Read- Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Also Read- Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:25 AM