ఫిల్మ్ చాంబర్లో వీరమల్లు నిర్మాత
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:27 AM
సినిమా టికెట్ ధరల పెంపు లేదా ఏ ఇతర విషయాలకు సంబంఽధించి అయినా సినీ పరిశ్రమకు చెందిన వారితో వ్యక్తిగత చర్చలకు తావులేదని ఇటీవలె...
సినిమా టికెట్ ధరల పెంపు లేదా ఏ ఇతర విషయాలకు సంబంఽధించి అయినా సినీ పరిశ్రమకు చెందిన వారితో వ్యక్తిగత చర్చలకు తావులేదని ఇటీవలె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ సూచన మేరకు ‘హరి హర వీరమల్లు’ చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం తాజాగా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిశారు. తమ చిత్రానికి సంబంధించి అదనపు షోలకు అనుమతి, టికెట్ ధరల సవరణ కోరుతూ లేఖను అందజేశారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఈనెల 12న విడుదల కానుంది.