సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

థగ్‌లైఫ్‌ను అడ్డుకుంటాం

ABN, Publish Date - Jun 03 , 2025 | 04:31 AM

కన్నడ భాష గురించి నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో థగ్‌లైఫ్‌ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 5న సినిమాను కర్నాటకలో విడుదల చేస్తే...

కన్నడ భాష గురించి నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో థగ్‌లైఫ్‌ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 5న సినిమాను కర్నాటకలో విడుదల చేస్తే థియేటర్లకు నిప్పు పెడతామని కర్ణాటక రక్షణ వేదిక(కరవే) రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ హెచ్చరించారు. కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజ్‌ మైసూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కమల్‌హాసన్‌ సినిమాను బహిష్కరించాల్సిందేనని అన్నారు.

హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌

థగ్‌లైఫ్‌ సినిమాకు వస్తున్న బెదిరింపులపై కమల్‌ హాసన్‌, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సినిమా ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన భద్రత కల్పించేలా చూడాలని కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించినప్పుడు తాను చప్పట్లు కొట్టలేదని నటుడు శివరాజ్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. అన్ని భాషలూ ముఖ్యమైనవేనని, తన మాతృభాష కన్నడకే ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఇంతకు ముందే చెప్పానని అన్నారు. కన్నడ కోసం తన ప్రాణమైనా ఇస్తానని అన్నారు.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 03 , 2025 | 04:31 AM