పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:26 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నిర్మాత ఎ.ఎం.రత్నంకు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం ‘హరి హర వీరమల్లు’ ...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నిర్మాత ఎ.ఎం.రత్నంకు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. పవన్ కల్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో పవన్ కల్యాణ్ పోరాట యోధుడిగా నటిస్తున్నారు. కాగా, మంగళవారం ఏ.ఎం.రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హరి హర వీరమల్లు’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని అన్నారు. పవన్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా నిలుస్తుందని తెలిపారు.
ఏ.ఎం.రత్నం