Tammareddy Bharadwaja Launch: యూత్ టీమ్‌తో థాంక్యూ డియర్
ABN, Publish Date - May 24 , 2025 | 01:32 AM
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థాంక్యూ డియర్’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. యువ బృందంతో రూపొందుతున్న ఈ చిత్రానికి తోట శ్రీకాంతకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సినిమా చేస్తున్న యువ బృందానికి ఆశీస్సులు అందజేసి సినిమా విజయం సాధించాలని భరద్వాజ కోరారు. హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ ‘ఇది నా రెండో సినిమా. నా కెరీర్‌కు కీలకమైంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తోట శ్రీకాంతకుమార్ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ పుణీత్ రెడ్డి.