సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ రక్కసి క్రీడను ఆపాలంటే

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:04 AM

ఆది సాయికుమార్‌ హీరోగా యుగంధర్‌ ముని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’. షైనింగ్‌ పిక్చర్స్‌ బేనర్‌పై రాజశేఖర్‌ అన్న భీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు...

ఆది సాయికుమార్‌ హీరోగా యుగంధర్‌ ముని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’. షైనింగ్‌ పిక్చర్స్‌ బేనర్‌పై రాజశేఖర్‌ అన్న భీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల మేక ర్స్‌ ‘శంబాల’ మేకింగ్‌ వీడియోని రిలీజ్‌ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు. ‘ఈ విశ్వంలో అం తు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అం టుంది.. అదే సమాధానం దొరికితే నమ్మకం అంటుంది. పంచభూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు.. దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం.. ఇప్పు డు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే..’ అంటూ వచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఉత్కంఠభరితంగా ఉంది.

Updated Date - Jun 08 , 2025 | 04:05 AM