త్వరలో కలుసుకుందాం...
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:21 AM
తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నానని, త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వారిని కలుస్తానని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. త్వరలో కలుసుకుందాం...
తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్నానని, త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వారిని కలుస్తానని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నా అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరినీ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నా. అందుకు సజావుగా సమావేశమవడానికి అనుమతుల కోసం పోలీస్, సంబంధిత అధికారులతో సంప్రదిస్తున్నాం. ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పుగా ఉండాలని అభిమానులను కోరుతున్నా. నన్ను కలుసుకోవడానికి పాదయాత్రలు వంటివి చేయొద్దు. మీ ఆనందమే కాదు, మీ సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానం’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.