Ramayana: యుద్ధం కోసం సన్నద్ధం
ABN , Publish Date - May 30 , 2025 | 05:44 AM
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కన్నడ కథానాయకుడు యశ్ రావణుని పాత్ర...
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కన్నడ కథానాయకుడు యశ్ రావణుని పాత్ర పోషించడమే కాకుండా చిత్ర నిర్మాణంలో భాగస్వామి కూడా అయ్యారు. ఈ భారతీయ ఇతిహాసాన్ని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా దర్శకుడు నితిశ్ తివారి అద్భుతంగా ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘మ్యాడ్ మ్యాక్స్.. ఫ్యూరీ రోడ్’, ‘ద సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు స్టంట్ డైరెక్టర్‌గా పని చేసిన గై నోరిస్ ‘రామాయణ’ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఆయన సారథ్యంలో యశ్ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గురువారం విడుదల చేశారు. రెండు భాగాలుగా ‘రామాయణ’ చిత్రం తయారవుతోంది. తొలి భాగం 2026 సంవత్సరంలో, రెండో భాగం 2027 సంవత్సరంలో దీపావళికి విడుదలవుతాయి.