సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నవ్వులూ చర్చలు

ABN, Publish Date - May 23 , 2025 | 04:10 AM

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకటసతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే...

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకటసతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. దాదాపు 30 శాతం షూటింగ్‌ పూర్తైంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఇందుకోసం ఓ విలేజ్‌ సెట్‌ను నిర్మించారు. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు, నటుడు దివ్యేందు శర్మతో కలసి తీసుకున్న ఫొటోను రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. ‘నవ్వులు, చర్చలు, విపరీతమైన హార్డ్‌ వర్క్‌తో నిండిన ఈ షెడ్యూల్‌ హుషారుగా సాగుతోంది’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయిక. జగపతిబాబు, శివరాజ్‌కుమార్‌, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదలవుతోంది.

Updated Date - May 23 , 2025 | 04:10 AM